BigTV English

Ekta Kapoor : బాలీవుడ్ నిర్మాతకు బిగ్ షాక్.. విచారణకు కోర్టు ఆదేశాలు..

Ekta Kapoor : బాలీవుడ్ నిర్మాతకు బిగ్ షాక్.. విచారణకు కోర్టు ఆదేశాలు..

Ekta Kapoor : బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ గురించి అందరికి తెలిసిందే.. ఆమె ఒక నిర్మాతగా వ్యవహారిస్తూ వరుసగా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తన వెబ్ సిరీస్‌లో భారతీయ సైనికులను అగౌరవపరిచారనే ఆరోపణలపై సినీ మరియు టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. శనివారం ఈ వెబ్ సిరీస్ పై పోలీసులకు ఫిర్యాదు వచ్చిందని తెలుస్తుంది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఆ కేసు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


తన వెబ్ సిరీస్ లో ఇండియన్ ఆర్మీ పై తప్పుగా చూపించారని ముంబై పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఇక కోర్టు కూడా ఫిర్యాదును దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 202 ప్రకారం మే 9లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది, ఇది ఫిర్యాదుపై విచారణ జరపడానికి లేదా పోలీసులకు సూచించడానికి మేజిస్ట్రేట్‌ను అనుమతించింది..

Also Read : బాలీవుడ్ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న సమంత.. ఇదేం ట్విస్ట్ రా బాబు..


హిందుస్తానీ భావు అని పిలువబడే యూట్యూబర్ వికాస్ పాఠక్ ఫిర్యాదును దాఖలు చేశారు. ఏక్తా కపూర్ OTT ప్లాట్‌ఫారమ్ ఆల్ట్ బాలాజీ, ఆమె తల్లిదండ్రులు శోభ మరియు జీతేంద్ర కపూర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ సహకారంతో ఆమె పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ‘ఆల్ట్ బాలాజీలో’ అనే వెబ్ సిరీస్ దాని ఎపిసోడ్‌లలో ఒకదానిలో “అక్రమ లైంగిక చర్య”లో ఓ సైనికుడు పాల్గొన్నట్లు తప్పుగా చూపించారు. దానిపై దేశంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సైనికులను తప్పుగా చూపించారు. దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉందని వెబ్ సిరీస్ పై వ్యతిరేఖత మొదలైంది. దాంతో తాజాగా కీర్టు ఆమె ను అదుపులోకి తీసుకోవాలని ముంబై కోర్టు నగర పోలీసులను ఆదేశించింది.

యూట్యూబర్ పాఠక్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. యూట్యూబ్ లో ఆయన వీడియోలకు క్రేజ్ ఎక్కువే.. అలాగే వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో అనేక గేమ్ షోలలో పాల్గొన్న ఈయన తన యాటిట్యూడ్ తో క్రేజ్ ను అందుకున్నాడు. ఇక బుల్లితెర టాప్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 2019 సీజన్‌లో పాఠక్ పాల్గొన్నాడు. మే 2021 లో, కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి, విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శివాజీ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేసినందుకు ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.. మరి ఈ ఏక్త కపూర్ పై కేసు నమోదు అవ్వడం తో బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నిర్మాత ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.. బాలీవుడ్ లో గతంలో ఇలాంటి కేసులు ఎన్నో నమోదు అయ్యాయి. కానీ కొన్ని కేసులు వివరణతో వివాదాలకు చెక్ పెట్టారు. ఈమె ఎలాంటి వివరణ ఇస్తుందో..? లేదా వెబ్ సిరీస్ ను రిమూవ్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×