BigTV English

Horoscope  Today February 22nd:  ఆ రాశి వారికి ఈరోజు భూసంబంధిత వ్యవహారాలలో అఖండ లాభాలు

Horoscope  Today February 22nd:  ఆ రాశి వారికి ఈరోజు భూసంబంధిత వ్యవహారాలలో అఖండ లాభాలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 22న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి.

వృషభం: నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.


మిధునం: ఇంట్లో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి.

సింహం: భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇంట్లొ కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు.

కన్య: దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

తుల: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి.

వృశ్చికం: శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

ధనస్సు: ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి.

మకరం: నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం: సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తారు.

మీనం: కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ భారం అధికమవుతుంది. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×