BigTV English

Allu Arjun: ‘పుష్ప 2’ సినిమాలో ఆ సీన్ చేయడానికి భయపడ్డా.. రివీల్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun: ‘పుష్ప 2’ సినిమాలో ఆ సీన్ చేయడానికి భయపడ్డా.. రివీల్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun: కొన్నిరోజుల క్రితం తెలుగులో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ మధ్య ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ గురించే టాపిక్ నడిచింది. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, కాంట్రవర్సీ అయినా.. ఏదైనా సరే దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా ‘పుష్ప 2’ కలెక్షన్స్ విషయంలోనే కాదు.. ఎన్నో రకాలుగా రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా వల్ల దానికోసం పనిచేసిన అందరి రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హీరోగా అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్ చేసింది. అలా ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్లింది. తాజాగా ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజిన్ సంస్థకు బన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘పుష్ప 2’ గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు.


అదే సీన్

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా అల్లు అర్జున్ స్థాయిని మరింత పెంచేసింది. దానివల్లే పాన్ ఇండియా పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీలో చాలావరకు సీన్స్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జాతర సీన్. ఈ సినిమాలో జాతర సీన్ బాగుంటుందని, అందులో అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూస్తామని ముందు నుండే మేకర్స్ అంతా చెప్తూ ఉన్నారు. దీంతో అసలు ఈ సీన్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు కూడా విపరీతంగా అంచనాలు పెంచేసుకున్నారు. అయితే ఈ జాతర సీన్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు బన్నీ.


మొదటి రియాక్షన్

‘‘పుష్ప 2లో జాతర సీన్ చేయడానికి చాలా భయపడ్డాను. అదే సినిమాలో నన్ను చాలా భయపెట్టిన విషయం. పుష్పరాజ్ అవతారంలో మాచో ఫోటోషూట్ చేసిన తర్వాత శారీ సీన్ చేశాను. వెంటనే అలా లుక్ మార్చడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు స్క్రీన్‌పై ఇది ఎలా కనిపిస్తుందో అనే ఆలోచనే ఎక్కువగా ఉంది. నాకు ముందుగా జాతర సీన్ గురించి చెప్పినప్పుడే భయపడ్డాను. అదే నా మొదటి రియాక్షన్. పుష్పరాజ్ అవతారంలో ఫోటోషూట్ వెంటనే డైరెక్టర్ వచ్చి శారీ కట్టుకోవాలని అన్నాడు. ఎన్నో స్కెచ్‌ల తర్వాత ఆ గెటప్ సినిమాలో చూసినట్టుగా వచ్చింది. లుక్స్ మారుస్తూ ఉన్నప్పుడు మెల్లగా నా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది’’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

Also Read: ‘రాజా సాబ్’ అలాంటి సినిమా కాదు.. ఆసక్తికర విషయం బయటపెట్టిన మాళవికా..

ఆయనకే క్రెడిట్

‘‘చీర కట్టుకొని ఉన్నా కూడా ఆ లుక్ చాలా మాచోగా ఉండాలి. క్యారెక్టర్ మార్చకుండా ఉండడమే కష్టం. సినిమాలో జాతర సీనే హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఫారిన్ ఆడియన్స్ దానిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆదరించారు’’ అని అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం జాతర సీన్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) పర్ఫార్మెన్స్ అద్భుతం అంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. తనతో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనా కూడా శారీలో ఒక స్టార్ హీరో అలా చేయడం చాలా కష్టమని, అల్లు అర్జున్ చాలా సింపుల్‌గా చేసి చూపించాడని తెలిపింది. మొత్తానికి ఈ క్రెడిట్‌ను దర్శకుడు సుకుమార్‌కే ఇచ్చేశాడు అల్లు అర్జున్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×