Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: విలువైన వస్తువులు,వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆకట్టుకుంటారు. వేడుకలలో కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. కాంట్రాక్టర్లు గతంలో జారవిడిచిన పనులు సైతం తిరిగి పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషదాయకమైన సమాచారం అందుతుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అనుకూల ఫలితాలు.
వృషభం: మీ నిర్ణయాలు కొందరు వ్యతిరేకించినా వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. పలుకుబడి పెంచుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వివాదాలను పరిష్కరించుకునేందుకు చొరవ చూపుతారు. ఉద్యోగస్తులకు మార్పులు జరిగే అవకాళాలు ఉన్నాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పత్రికారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం: ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు, ఇతర సమస్యల పరిష్కారంలోనూ చొరవ చూపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగార్ధుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు, సన్మానాలు పొందుతారు.
కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. అదనపు రాబడి కలిగి రుణాలు తీరుస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. పదిమందిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగార్ధులకు కోరుకున్న ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల ఆత్మీయ పలకరింపులతో సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు విజయాలు సాధిస్తారు.
సింహం: కొన్ని కార్యాలను చక్కదిద్దుతారు. కుటుంబసభ్యులు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడంలో కొంత వెనుకబడ్డా చివరికి విజయం సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలు ఒక కొలిక్కి తెస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు పునాదులు పడతాయి. వాహనాలు, గృహం, ఆభరణాలు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాలు సమతూకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు ఊహించని సత్కారాలు అందుకుంటారు.
కన్య: చేపట్టిన కార్యక్రమాలను స్వశక్తితోనే పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరులు, స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. ఆరోగ్యసమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త పోస్టులు వచ్చే అవకాశం. రాజకీయవేత్తలు, పరిశోధకుల ఆశలు ఫలిస్తాయి.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
తుల: ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆదాయం సమకూరినా కొత్త అప్పులు కూడా చేస్తారు. మీ ఆలోచనలు, నిర్ణయాలతో కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కేందుకు మరింత కృషి చేస్తారు. ఇంటి నిర్మాణాలను చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
వృశ్చికం: ఆశ్చర్యకరంగా దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరే అవకాశం. కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు. పట్టుదలతో క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు శిరసావహిస్తారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వ్యాపారులు అనూహ్యంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సత్తా నిరూపించుకునే సమయం.
ధనుస్సు: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. వేడుకల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సొంతం చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. కోర్టు వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారులు లాభాల దిశగా పయనిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు స్వీయానుభవాలతో విజయాలు సాధిస్తారు.
మకరం : విద్యావకాశాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొన్ని సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. చేపట్టిన కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం గతం కంటే మరింతగా పెరగవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. భవిష్యత్తు కార్యాచరణపై దష్టి పెడతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడుల నుంచి కొంత విముక్తి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు ఊహించని అవకాశాలు పొందుతారు.
కుంభం: కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. మీ మనోభావాలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. భూ, వాహనయోగాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. చిన్ననాటి సంఘటనలు ఎదురవుతాయి. ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శత్రువులను సైతం సన్నిహితులుగా మార్చుకుంటారు. వ్యాపారులు లాభాలు అనుకున్న మేరకు పొందుతారు ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు మరిన్ని అవకాశాలు.
మీనం: కుటుంబ సమస్యలతో కుస్తీపడతారు. ఆదాయం కొంత తగ్గి కొత్త అప్పులు చేస్తారు. తరచూ ప్రయాణాలు సంభవం. వారసత్వ ఆస్తుల వ్యవహారంలో బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆప్తుల సూచనలు, సలహాలను కోరతారు. అనుకున్న కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎదురుకావచ్చు. ఆస్తుల వ్యవహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. వ్యాపారులు లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు తథ్యం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు