Rakul Preet Singh.. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తెలుగులో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని, స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిన క్రమంలో బాలీవుడ్ కి వెళ్లిన ఈమె.. అక్కడే సినిమాలు చేసుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఏ సినిమా కూడా పెద్దగా ఈమె కెరియర్ కు పునాది వేయలేకపోయింది. దాంతో అక్కడే ప్రముఖ నటుడు ,నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. కనీసం వివాహం తర్వాత అయినా.. ఈమె కెరియర్ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె సినీ కెరియర్ లో ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం.
ఆశలు పెట్టుకున్న సినిమా కూడా ఫ్లాప్..
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా “మేరీ హస్బెండ్ కి బీవీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాపై ‘ఛావా’ ఎఫెక్ట్ భారీగా పడిందనే చెప్పాలి.అర్జున్ కపూర్ (Arjun Kapoor), హీరోగా భూమి పెడ్నేకర్ Bhoomi pednekar), రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడం, ప్రచారం కూడా తక్కువగా జరిగడం సినిమాకు మైనస్ గా మారింది. కనీసం ఓపెనింగ్స్ కూడా అనుకున్నట్లు జరగలేదు. పైగా ఛావా సినిమాకు ఎక్కువ స్క్రీన్ లు కేటాయించడంతో ఈ సినిమాకు కేవలం తక్కువ స్క్రీన్లు మాత్రమే లభించాయి. దీంతో కొన్ని స్క్రీన్ లలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికితోడు 1+1 ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ ఈ ఆఫర్ కూడా పెద్దగా ప్రజలను ఆకర్షించలేకపోయింది. దీంతో మొదటి రోజు కేవలం రూ.2 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వీకెండ్ లో కొంత రెవెన్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయని, సినిమా లాంగ్ రన్ ముగిసేసరికి కనీసం రూ.20 కోట్లయినా రాబడుతుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.
పెళ్లయినా తప్పని ఇబ్బందులు..
మొత్తానికి అయితే రకుల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని, ఆమె పాత్రకు ప్రాముఖ్యత కలిగి ఉండడంతో హిట్ అయితే బాలీవుడ్లో మరిన్ని ఆఫర్లు అందుకుంటానని కూడా ఆశించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమెకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు రావడం మరింత కష్టంగా మారింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లయినా కూడా ఈమెకు దరిద్రం పోవడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా సినిమా కెరియర్ ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి కలిసి రావడం లేదని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. మరి రకుల్ ఇకనైనా ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇదిలా వుండగా రకుల్ హీరోయిన్ గానే కాకుండా జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసి అటు బిజినెస్ రంగంలో మాత్రం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తో పాటు ముంబై వంటి ప్రధాన నగరాలలో ప్రత్యేకించి జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసి వీటి ద్వారా బాగానే ఆర్జిస్తోంది. కాబట్టి సినిమాలు లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉండవు కానీ సినిమా లేకపోతే కెరియర్ లేదు కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేయాలని కూడా ఫాన్స్ కోరుకుంటున్నారు.