E-Paper
Advertisement

Horoscope  Today February 4th: ఆ రాశి వారికి ఈరోజు బంధు, మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి  

Horoscope  Today February 4th: ఆ రాశి వారికి ఈరోజు బంధు, మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 4న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి ఉద్యోగులు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మకర రాశి: ఈ రాశి ఉద్యోగులకు పై అధికారులు ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బంధు, మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×