Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఫస్ట్ సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్నది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది గాని అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమెకు సరైన క్రియేట్ ని అందించలేకపోయింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపుని అందుకోలేక పోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ అదే రేంజులో స్టార్ హీరోలతో సినిమాలను చేతిలో పెట్టుకుంటుంది.. ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతున్న శ్రీలీలకు ఓ హీరోయిన్ షాక్ ఇచ్చింది. ఆమె ఎంట్రీ తో శ్రీ లీల ఆఫర్ ఒకటి ఎగ్జిట్ అయింది. ఆమెను సినిమా నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకొని వరుస సినిమాలలో క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తుంది. సరైన హిట్ సినిమా లేకపోయినా స్టార్ హీరోలు అందరూ సరసర నటించే అవకాశాన్ని మాత్రం అందుకుంది. ఒక్క ఏడాదిలోని అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది. శ్రీలీల హీరోయిన్ గా తెలుగులో ఇపుడు ఎన్నో సినిమాలు చాలా తక్కువ టైం లోనే చేసేసి మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు. ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల ఒక్క తెలుగు లోనే కాకుండా రీసెంట్ గానే తమిళ్ లో కూడా అడుగు పెట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. హీరో శివ కార్తికేయన్ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ చిత్రం పరాశక్తి తో తమిళ్ ఎంట్రీ ఇస్తుండగా సౌత్ లో మంచి లైనప్ తో శ్రీలీల మోస్ట్ వాంటెడ్ గా మారింది.
తెలుగు తమిళ్లో వరుస సినిమాలతో బిజీ అవుతున్న హీరోయిన్ కు బాలీవుడ్ ఆఫర్స్ కూడా రావడం కామన్.. శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని ఎప్పుడు నుంచో పలు కథనాలు ఉన్నాయి. కాగా ఆమె మొదటి సినిమా గత ఏడాదిలోనే బాలీవుడ్ లో మొదలవ్వాల్సి ఉంది కానీ అది ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. బాలీవుడ్ స్టార్ కొడుకుతో సినిమాల్లోకి ఎంట్రీ అవుతుందని టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. దేవర సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ ఆఫర్ ని ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరోయిన్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కు ఈ అవకాశం వచ్చినట్లు సమాచారం. మొదటి సినిమానే బాలీవుడ్ లో శ్రీలీలకు పెద్ద షాక్ ఇచ్చింది.. ఇక ప్రస్తుతం తెలుగులో అయితే రవితేజతో ఓ సినిమా చేస్తుంది. తెలుగు అటు తమిళ్లో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు శ్రీలీలకు బాలీవుడ్ లో ఏ హీరోతో ఛాన్స్ వస్తుందో చూడాలి..