RRR on YS Jagan: ఎంతైనా మాజీ సీఎం జగన్ అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు అభిమానం ఎక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకేనేమో ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్ తనదైన శైలిలో జగన్ కు పలు సూచనలు జారీ చేశారు. అలాగే తన కస్టోడియల్ టార్చర్ గురించి అయితే.. తగ్గేదేలే అంటున్నారు త్రిబుల్ ఆర్. మొత్తం మీద డిప్యూటీ స్పీకర్ గా జగన్ కు ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటో తెలుసుకుందాం.
ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ ను మీడియా ప్రతినిధులు కలిశారు. మీ ద్వార జగన్ కు ఓ సలహా ఇస్తున్నాను అంటూ రఘురామకృష్ణంరాజు, మీడియా ప్రతినిధులతో మాటామంతీ ప్రారంభించారు. పులివెందుల ఎమ్మేల్యే హోదాలో జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
అంతేకాదు మరో హెచ్చరిక కూడ జారీ చేశారు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం రద్దవుతున్న విషయం తెలిసిందే. అదే టాపిక్ లేవనెత్తారు డిప్యూటీ స్పీకర్. జగన్ తో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేకపోతే సరైన కారణాలతో అభ్యర్థన ఇవ్వాలని, లేకపోతే వచ్చి సంతకం చేసి వెళ్లిపోవచ్చని కూడా త్రిబుల్ ఆర్ సూచించారు. ఇలా చేయని పక్షంలో పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు కూడా వస్తాయని, జగన్ అసెంబ్లీకి రాక తప్పదంటూ రఘురామ అన్నారు.
అలాగే తన కస్టోడియల్ టార్చర్ గురించి మాట్లాడుతూ.. తనను కస్టడీలో ఉంచి ఇబ్బందులకు గురిచేసిన కేసులో పోలీస్ అధికారి సునీల్ కుమార్ పాత్ర ఉందని, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. తాను ఈ కేసు విషయంలో కేవలం బాధితుడుగా మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నానని, ఇప్పటికే ప్రభుత్వాన్ని తన కేసుకు సంబంధించి పలుమార్లు ప్రశ్నించినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఏది ఏమైనా ఈ కేసు కు సంబంధించి తన పోరాటం ఆగే ప్రసక్తే లేదంటూ ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: Lady Aghori: లేడీ అఘోరీకి పోలీస్ ట్రీట్మెంట్.. ఏకంగా కారుతో సహా గాల్లోకెత్తి అదుపులోకి..
అయితే కస్టోడియల్ కేసు విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని విచారించే అరెస్టు చేసిన ఎస్పీ దామోదర్, త్వరలోనే ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.