E-Paper
Advertisement

Horoscope  Today February 8th: ఆ రాశివారు ఈరోజు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు

Horoscope  Today February 8th: ఆ రాశివారు ఈరోజు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 8న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది

మిధున రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాల విస్తరణలకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు తప్పవు.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ద  చేయడం మంచిది. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన పరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×