Nindu Noorella Saavasam Serial Today Episode : కాళీ జైలు నుంచి నేరుగా అమర్ ఇంటికి వస్తాడు. అమరేంద్ర గారు అంటూ గట్టిగా పిలుస్తూ లోపలికి వస్తుంటే.. రాథోడ్ అడ్డుపడతాడు. నువ్వు జరుగు అంటూ లోపలికి వెళ్తాడు. మిస్సమ్మ వచ్చి అడ్డుపడుతుంది. అయినా వినకుండా కాళీ లోపలికి వెళ్లబోతుంటే.. శివరాం, నిర్మల వస్తారు. ఏయ్ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నేను మీతో ఎవ్వరితో మాట్లాడను.. అమరేంద్ర గారితోనే మాట్లాడతాను అంటూ పిలుస్తుంటాడు. ఇంతలో రాథోడ్ కోపంగా కాళీ గల్లా పట్టుకుని బయటకు పోరా అంటాడు. దీంతో కాళీ కోపంగా రాథోడ్‌ను కొట్టబోతుంటే.. అమర్ వచ్చి ఆపుతాడు. కాళీని కొడతాడు. దీంతో కాళీ అమర్ చేయి పట్టుకుని నేను మీ ఎదురుగానే ఉన్నాను మీరు చంపొచ్చు అయినా ఇవాళ నేన నిజం చెప్పడానికి వచ్చాను అంటాడు.
దీంతో మిస్సమ్మ నిజమా.. ఏంటి మామయ్యా ఆ నిజం అని అడుగుతుంది. కాళీ ఈ ఇంటి కోడలు ఈయన గారి మొదటి భార్య ఈ పిల్లల తల్లి ఏ పాపం ఎరుగని ఆవిడ చావు వెనకాల ఎవరున్నారో చెప్పడానికి వచ్చాను అంటాడు. దీంతో శివరాం ఏంటి మా కోడలిని ఎవరు చంపారో నీకు తెలుసా..? అని అడుగుతాడు. దీంతో కాళీ నాకే కాదు సార్.. మీకు కూడా తెలుసు.. కానీ మంచితనం అనే ముసుగులో వాళ్లు ఉండటం వల్ల మీకు తెలియడం లేదు ఈయనను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని ఆమెను చంపారు. అప్పటి సంది ఈ ఇంట్లో ఏ కష్టం వచ్చినా దాని వెనకాల ఉన్నది ఆమె.
సరస్వతి వార్డెన్‌కు నిజం తెలుసని కూడా ఆవిడను నాతో చంపించాలనుకున్నారు. రెండో సారి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తే.. మధ్యలో భాగీ వచ్చిందని భాగీని కూడా అప్పటి నుంచి చంపడానికి చూస్తున్నారు అని కాళీ చెప్పగానే అమర్ కోపంగా ఎవరు? ఆ ఆరును చంపింది ఎవరు..? ఆ బాబ్జీ వెనక ఉండి ఎవరు చేశారు అని అడుగుతాడు. దీంతో కాళీ ఆ మనోహరియే ఇదంతా చేసింది అని చెప్తాడు కాళీ. దీంతో అమర్ కోపంగా మనోహరి అని గట్టిగా పిలుస్తాడు. రూంలో అంతా కలగన్న మనోహరి ఉలిక్కిపడుతుంది. ఆ కాళి గాడు అనుకున్నంత చేస్తాడు. రేపు వెళ్లి నేనే వాణ్ని కూల్ చేయాలి అనుకుంటుంది.
యమలోకంలో ఉన్న గుప్త.. కింద భూలోకంలో ఉన్న చిత్రగుప్తుడిని ఆరును చూస్తూ నవ్వుకుంటాడు. మా చిత్రగుప్తుడి వర్తమానం నాకు కనిపిస్తుంది అని హ్యాపీగా ఫీలవుతుంటాడు. చిత్రగుప్తుడు పరుగెత్తుకుంటూ ఆరు దగ్గరకు వెళ్లి నాగమణి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. దీంతో ఆరు చిత్రగుప్తుడిని తిడుతూ.. అసలే అంజును ఆ మనోహరి, రణవీర్ కలిసి కోల్‌కతా తీసుకెళ్తున్నారు. వాళ్లిద్దరూ కలిసి అంజును ఏం చేస్తారో అని నేను టెన్షన్ పడుతుంటే.. మధ్యలో మీ గోల ఒకటి. నా పని పూర్తి అయ్యే వరకు ఒక మూలన కూర్చోండి.. లేదంటే యమపురికి వెళ్లిపోండి.. పని పూర్తి అయ్యాక పిలుస్తాను వచ్చి తీసుకెళ్లండి అంటుంది. దీంతో గుప్త బాధపడతాడు.
కోల్‌కతా వెళ్లడానికి అంజు రెడీ అవుతుంది .పిల్లలందరూ అంజును కిందకు తీసుకొస్తారు. బయట నుంచి గమనిస్తున్న ఆరు బాధపడుతుంది. అంజు చిన్న మనసుకు వాళ్ల స్వార్థం అర్థం కావడం లేదు. అనుకుంటుంది. అంజు బిల్డప్ చూసి రాథోడ్ వెటకారంగా మాట్లాడతాడు. అంజు పాప నువ్వు ఉండే రెండు రోజులకు ఇంత బిల్డప్ అవసరమా అంటాడు. నిర్మల కూడా ముందు నువ్వు ఆ కళ్లజోడు తీసేయ్ లేదంటే కనబడకు ఎక్కడైనా కింద పడతావు అంటుంది. ఇంతలో అమర్, మిస్సమ్మ కిందకు వస్తారు. అమర్ బోర్డింగ్‌కు ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతాడు. గంటన్నర ఉందని చెప్తాడు. రాథోడ్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడని చెప్పగానే సరే అంటూనే.. మర్చిపోయి రణవీర్, మనోహరి ఫ్లైట్‌కు టైం అవుతుంది త్వరగా రా అని పిలుస్తాడు.
దీంతో అందరూ షాక్ అవుతారు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అని రణవీర్ అడుగుతాడు. దీంతో మిస్సమ్మ.. రణవీర్ గారు మీరు అలవాటులో పొరపాటుగా అందరి ముందు మీ పరిచయాన్ని బయటపెట్టేశారు. అదే మనోహరి గారు మీకు బాగా తెలిసినట్టు.. పరిచయం ఉన్నట్టు అంత క్లోజ్‌గా పిలిచారు కదా.. అది అలవాటా..? పొరపాటా..? అని అడుగుతున్నాను అంటుంది. అదా కోల్‌కతాలో కొంచెం పరిచయం ఉన్నా క్లోజ్‌గా పిలుస్తాం..అని రణవీర్ చెప్తాడు. ఇంతలో మనోహరి వచ్చి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు.. మాకు ఇంతకు ముందు పరిచయం ఉండటం ఏంటి..? అని తిడుతుంది. ఇంతలో రణవీర్.. మనోహరి గారు మీ లగేజీ ఎక్కడ ఫ్లైట్‌కు టైం అవుతుంది అండి అని అడుగుతాడు.
దీంతో మనోహరి .. నాకు ఇవాళ రావడం కుదరదు. మీరు అంజలి వెళ్లండి నేను రేపు పొద్దునే జాయిన్ అవుతాను అని చెప్తుంది. రణవీర్ ఏమైంది ఎందుకు రావడం లేదు.. అని అడుగుతాడు. దీంతో మనోహరి.. రేపు పొద్దునే ఒక చిన్న పడింది. అది చూసుకుని వచ్చేస్తాను అని చెప్తుంది. దీంతో రణవీర్.. మనోహరి గారు రేపు పొద్దున్నే అంజలిని మనం ఒక ఫేమస్ ప్లేస్ కు తీసుకెళదాం అనుకున్నాం కదా మీరు రాకపోతే నేను ఎలా తీసుకెళ్లగలను చెప్పండి అంటాడు. పరిస్థితి అర్థం అయింది కానీ నాది ఇంపార్టెంట్ పని అది అయ్యాక వస్తాను అంటుంది మనోహరి. ఇంతలో అమర్ ఎందుకు అంత భయపడుతున్నావు మనోహరి.. ఏదైనా ప్రాబ్లమా..? అని అడుగుతాడు. ఏం లేదు అమర్.. ఆశ్రమం పని పడింది. అది చూసుకుని వెళ్తాను అని చెప్తూ.. రణవీర్ గారు మీరు వెళ్లండి నేను రేపు వచ్చి నేను కలుస్తాను అంటుంది.
దీంతో నిర్మల అనుమానంగా మనోహరి నువ్వు వెళ్లేది మీ ఫ్రెండ్ ఇంటికి కదా..? రణవీర్ దగ్గరకు వెళ్తాను అంటున్నావేంటి అని అనుమానంగా అడుగుతుంది. దీంతో ఏం లేదు ఆంటీ.. అంజును తీసుకెళ్లాలి కదా అందుకే అలా చెప్పాను అంటుంది. రణవీర్ అంజున తీసుకుని వెళ్లబోతుంటే.. మిస్సమ్మ.. రణవీర్ గారు మీతో అంజును పంపించడం కుదరదు. ఒక ఆడపిల్ల తల్లిగా మీరు కూడా ఆలోచించండి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టి అంజును తీసుకెళ్లడం మీకు ఇష్టం ఉండదు అనుకుంటున్నా అని మిస్సమ్మ చెప్పగానే.. అమర్ కూడా అంజున తర్వాత పంపిస్తాం లేదంటే.. హాలిడేస్ లో మేమందరం కోల్‌కతా వస్తాము అని చెప్తాడు. రణవీర్ సరే అంటూ వెళ్లిపోతాడు. పిల్లలు అందరూ అంజున చూసి నవ్వుతుంటారు. అంజు సిగ్గుతో తల దించుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?