trinayani serial today Episode: త్రినేత్రిని పట్టుకుని నయనికి చెక్ పెట్టాలని తిలొత్తమ్మ అంటుంది. దీంతో పోయి పోయి సొంత చెల్లెలు ముందే చెప్తున్నావా మమ్మీ అంటాడు వల్లభ. అరేయ్ చెల్లి చెల్లే పేకాట పేకాటే అంటుంది తిలొత్తమ్మ. అంత ఆస్తి అప్పనంగా వస్తుందంటే నేను మీ మార్గంలోనే నడుస్తాను అత్తయ్యా అంటుంది సుమన. ముళ్లు కాదు కదా కత్తులున్నా సరే అడుగులు వేసేస్తాను అంటుంది. అమ్మా డబ్బులు అంటే ఎంత పిచ్చి సుమన నీకు అంటాడు వల్లభ. అది లేనివాళ్లను ఈ లోకం పిచ్చొళ్లలా చూస్తుంది బావగారు.. అత్తయ్యా మీ ఐడియా ఏంటో చెప్పండి అంటుంది సుమన.
త్రినేత్రి నయనిలా నటించి ఎంత ఆస్తిని వెనకేసుకుందో కనుక్కుందాం. అలాగే దాన్ని పట్టుకుని పోలీసులకు పట్టించుకుండా దోచుకున్న దాంట్లో కాస్త వాటా ఇస్తామని చెప్పి త్రినయనిలా మార్చేసి మన వాటాలు పంచుకుందాం అంటుంది తిలొత్తమ్మ. దీంతో నయనిని వేసేస్తారా..? మమ్మీ అంటాడు వల్లభ. దీంతో మా అక్కనా..? అంటూ షాకింగ్ గా అడుగుతుంది సుమన. వీడు పిచ్చి మాటలు మాట్లాడతాడు సుమన అందుకే తెలివి లేదని వాడే ఒప్పుకుంటాడు. మనకు ఆస్థులు కావాలి కానీ ప్రాణాలు తీసుకుని మనం ఏం చేస్తాంరా..? పైగా అలాంటి పాపపు పని చేయకూడదు అంటుంది తిలొత్తమ్మ. అలా అన్నారు బాగుంది.. ఆ త్రినేత్రిని పట్టుకుని వాటాలు పంచుకుందాం అని నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను అని సుమన వెళ్తుంది. సుమన వెళ్లగానే వల్లభను తిలొత్తమ్మ తిడుతుంది.
గురువు గారు మీరు మా వదిన వాళ్ల మాటలు నమ్మి నయని కోమాలో ఉన్న నిజాన్ని చెప్తారని చాలా కంగారు పడ్డాం అంటుంది దురందర. అలా చేస్తాను దురందర. ఆ నేత్రి ఎంతో పుణ్యం చేసుకుంది. తన ప్రాణం కాళికాదేవి అమ్మవారిలో ఐక్యం అయినా ఇంకా ఆ శరీరం సత్ కార్యాలు చేస్తుంది అంటాడు గురువు. మీరు గాయత్రి పాపను తీసుకుని వెళ్లినప్పుడే మాకు అర్థం అయింది స్వామి.. అంటుంది నయని.. నాదేం ఉంది నయని నువ్వు సమయస్పూర్తితో వ్యవహరిస్తావని నాకు తెలుసు అంటాడు గురువు.
ఇంతలో హాసిని వచ్చి ఈరోజు నా జీవితంలో గుర్తు పెట్టుకునే స్పెషల్ డే అంటుంది. అవును నాకు ఇంకో సందేహం ఇన్నాళ్లు త్రినేత్రియే నయనిలా నటించింది అనుకుందాం.. ఆరోజు వైకుంఠం పాలలో విషం కలిపితే ఎలా కనిపెట్టింది. అని హాసిని అడుగుతుంది. చాలా తెలివిగా ఆలోచించావు హాసిని అంటాడు గురువు. నా ఆత్మ ఈ ఇంట్లోనే తిరిగేది నా వాళ్లకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటూ ఉండేదాన్ని.. ఆరోజు త్రినేత్రి లోకి దూరి నిన్ను కాపాడాను అంటుంది. ఇదేదో సినిమా కథలా ఉంది అంటుంది హాసిని.. కథలా ఉన్నా నమ్మాలి వదిన.. ఎందుకంటే ఆరోజు అద్దంలో కూడా వదిన ఆత్మ కనిపించింది కదా అనగానే అవును నిజమే కదా అంటుంది హాసిని.
రత్నాంభ సంచి తీసుకుని ఇంటికి రాగానే.. హాసిని పలకరిస్తుంది. ఎంటి కనిపించకుండా పోయారు అంటుంది. కనిపించకుండా పోయింది నేను కాదమ్మా నా మనవరాలు నేత్రి అంటుంది రత్నాంభ. ఇంతలో సుమన వచ్చి నిజమే మా నయని అక్కా కోమాలోంచి బయటకు రాగానే నీ మనవరాలు పారిపోయింది కదా..? అంటుంది. అంటే కోమాలో ఉందన్న విషయం మీకు తెలుసా..? అని రత్నాంభ అడుగుతుంది. అవునని ఇన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో ఉన్న పెద్దమరదలును స్పృహలోకి వచ్చేలా చేశారు మా గురువు గారు అంటాడు వల్లభ. అలాగా అయితే నాటకం అంతా బయటపడిందన్న మాట అని రత్నాంభ అడుగుతుంది. పడింది నీ మనవరాలు ఆడిన నాటకం అంతా బయటపడింది అని తిలొత్తమ్మ అంటుంది.
ఇంతలో నయని వచ్చి రత్నాంభను ఎప్పుడు వచ్చావు బామ్మ అంటూ ఎప్పుడు తిన్నావో ఏమో తిందువురా.. అని పిలుస్తుంది. మీ వదిన నా మనవరాలిని అంత మాట అంటే నేను ఎలా ఊరుకుంటాను అంటూ తిడుతుంది. మీ అందరి క్షేమం కోసమే నా మనవరాలు నాటకం ఆడుతుంటే మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతారా అంటూ నిలదీస్తుంది రత్నాంబ. అయితే ఈ నాటకం గురించి నీకు ముందే తెలుసన్నమాట అంటుంది సుమన. దీంతో విక్రాంత్ సుమనను తిడతాడు. వీళ్ల అల్లుడు, కూతురు మనవరాలు మొత్తం ప్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా కలిసికట్టుగా నటించి కోట్లు కొల్లగొడదాం అనుకున్నారు అంటుంది తిలొత్తమ్మ.
రత్నాంభ తిలొత్తమ్మను తిడుతూ.. నేత్రి మనం ఇక వెళ్దాం పద అంటుంది. నీకు ఇంకా నిజం తెలియదా..? తను నీ మనవరాలు కాదు నయని అంటారు. దీంతో బామ్మ కన్పీజ్ అవుతుంది. ఇంతలో విశాలాక్షి వస్తుంది. ఎందుకు వచ్చావు అని వల్లభ అడిగితే మీకు సాయం చేద్దామని వచ్చాను అంటుంది. ఇంట్లో అర్దాంతరంగా కన్ను మూసేది తిలొత్తమ్మ అని విశాలాక్షి చెప్తుంది. దీంతో వల్లభ కంగారు పడతాడు. సాయం చేద్దామని వచ్చి నన్ను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావా గారడి పాప అంటుంది తిలొత్తమ్మ. నేను ఉండకూడదు అంటే వెళ్లిపోతాను అని విశాలాక్షి చెప్పగానే వద్దులే గారడి పాప నువ్వుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది అంటాడు వల్లభ. దీంతో అత్తయ్యా చూశారా మేం కాదు మీ కొడుకే మీరు ఎప్పుడెప్పుడు పోతారో అని ఎదురుచూస్తున్నాడు అంటుంది హాసిని. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?