E-Paper
Advertisement

Horoscope  Today January 17th: ఆ రాశి ఉద్యోగులు ఇవాళ సమస్యల నుంచి బయటపడతారు

Horoscope  Today January 17th: ఆ రాశి ఉద్యోగులు ఇవాళ సమస్యల నుంచి బయటపడతారు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 17న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు  వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిధున రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక  విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

మకర రాశి : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు  కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×