E-Paper
Advertisement

Horoscope  Today January 18th: ఆ రాశి వారు ఈరోజు విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  

Horoscope  Today January 18th: ఆ రాశి వారు ఈరోజు విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 18న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పై అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూలంగా మారతాయి.  కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×