E-Paper
Advertisement

Horoscope  Today January 1st: ఆ రాశి వారికి ఈరోజు నూతన వాహనయోగం ఉన్నది

Horoscope  Today January 1st: ఆ రాశి వారికి ఈరోజు నూతన వాహనయోగం ఉన్నది

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 1న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంట్లో బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.

కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×