trinayani serial today Episode: త్రినేత్రి దొరికే వరకు మేము ఇక్కడే ఉంటాము అంటుంది రత్నాంభ. అంతవరకు నయనిలో నా మనవరాలిని చూసుకుంటాను అని అడుగుతుంది. దీంతో విశాల్ సరే అని నేత్రిని నేను వెతికి తీసుకొస్తాను అని చెప్తాడు. ఇంతలో సుమన వచ్చి వైకుంఠాన్ని చూసి తిడుతుంది. ఇంట్లో నగలు ఎత్తుకుపోయే ముఖం నీది నీతో జాగ్రత్తగా ఉండాలి అంటుంది. సుమన మాటలకు రత్నాంభకు కోపం వస్తుంది. నా కూతురిని అంత మాటంటావా..? అంటూ సుమనను తిడుతుంది. తన రాక దాకా ఇక్కడ మూడు పూటలు మెక్కేయడమే కదా… అంటాడు వల్లభ.
దీంతో వీణ్ని బావగారు అంటావేంటే.. వీళ్లకు ఊడిగం చేసుకుటూ.. మాటలు పడటం నీకేంటే కర్మ మన ఊరికి వెళ్దాం పద అంటుంది రత్నాంభ. దీంతో త్రినేత్రియా.. అంటూ అందరూ షాక్ అవుతారు. అవును త్రినేత్రి కాకపోతే మీ నయని అనుకుంటున్నారా.. అంటూ నిలదీస్తుంది. మా అక్కను పట్టుకుని త్రినేత్రి అంటుంది అంటే చీర కట్టుకుని వచ్చిందేమో తను అంటుంది సుమన. ఏంటమ్మా నువ్వు అనేది తను మన త్రినేత్రియా అని వైకుంఠం అడిగితే.. అవునని మీ ఆయన్ని పిలువు అని నయనికి చెప్తుంది రత్నాంభ. బామ్మ గారు మీ మనవరాలిని వెతికి తీసుకొస్తానని బయటకు వెళ్లారు మా విశాల్ అని చెప్తుంది హాసిని.
నీకింకా అర్థం కాలేదా..? హాసిని అంటూ తిలొత్తమ్మ తిడుతుంది. ఇంతలో నయని కోపంగా రత్నాంభను తిడుతుంది. నా భర్త పిల్లలను వదిలేసి లంగావోని కట్టుకుని మీతో వచ్చేయాలా..? అంటూ నిలదీస్తుంది. దీంతో అయ్యో అలా మాట్లాడతావేంటే…? విశాల్ బాబు గారి కోసం ఇక్కడ ఉండాలని నాటకం ఆడదామని చెప్పావు కదే అంటుంది రత్నాంభ. దీంతో ఏంటి చెల్లి బామ్మ అలా అంటున్నారు అని హాసిని అడుగుతుంది. బాగానే నటిస్తున్నావమ్మా.. త్రినేత్రి.. మీ బామ్మ అంతలా చెప్పాకా.. ఇంకా నువ్వు మా నయని అనుకుని ఊరికే ఉంటామనుకుంటున్నావా..? అంటాడు వల్లభ. దీంతో ముగ్గురం కలిసి నాటకం ఆడాలని నువ్వే కదా చెప్పింది అంటూ రత్నాంభ.. విక్రాంత్‌ను తిడుతుంది. దీంతో వెరీగుడ్ ఈ డ్రామాలో నీ పాత్ర కూడా ఉందా..? విక్రాంత్ బాబు అంటుంది తిలొత్తమ్మ.
ఇంకా గేమ్ ప్లే చేయాలని చూడకు ఆ వయసులో అబద్దం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది. అనగానే నేను నమ్మను తను నా చెల్లి నయనియే అంటుంది హాసిని.. తోడబుట్టిన దాన్ని నాకే నమ్మకం కుదరడం లేదు నువ్వు ఎలా నమ్ముతావు అక్కా అంటుంది సుమన. ఇంతలో వైకుంఠం అమ్మా ఇక చాలు ఆపు మన మేనకోడలిగా ఉందని బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే పోలీసులకు చెప్తారు అంటుంది. రత్నాంభ నువ్వు మాట్లాడకే.. నువ్వు మాతో రా త్రినేత్రి అంటూ చెయ్యి పట్టుకుని లాగబోతుంటే.. ఏయ్ నన్ను వదిలేయ్ అంటుంది నయని. వైకుంఠం అడ్డు పడితే చెంప పగులగొడుతుంది రత్నాంభ. విశాల్ బాబు గారి భార్య నయని ఇంకా కోమాలో ఉందని చెప్తుంది. దీంతో కంగారుగా మా చెల్లి కోమాలో ఉందా..? ఎక్కడుంది అని హాసిని అడుగుతుంది.
మీ పిన్ని గదిలోనే ఉంది అని చెప్తుంది రత్నాంభ. అందరూ షాక్ అవుతారు. అందరూ కలిసి దురందర రూంలోకి వెళ్లి వెతుకుతారు. అక్కడ నయని కనిపించదు. ఇంతలో నయని నేను స్పృహలో లేను అనడం ఏంటి..? అని ప్రశ్నిస్తుంది. అది కాకుండా నేను పెద్దావిడతో నాటకం ఆడించానట పెద్దావిడ అంది కాబట్టి ఊరికే ఉన్నాను అంటాడు విక్రాంత్. రత్నాంభ పిచ్చి చూపులు చూస్తుంది. నయని ఎక్కడికి పోయిందా అని ఆలోచిస్తున్నాను అంటుంది. ఇంకేం ఆలోచిస్తావు బామ్మ వెళ్లి వేడి వేడిగా కాఫీ తాగు అంటుంది హాసిని.
మా అమ్మ ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతుంది. మా అమ్మకు పిచ్చి పట్టింది అంటుంది వైకుంఠం. దీంతో కోపంగా రత్నాంభ నాకు పిచ్చా అంటూ తిడుతుంది. మా అమ్మకు పిచ్చి పట్టిదని చెబితేనే మేము ఇంకొన్నాళ్లు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని మనసులో అనుకుని మా అమ్మకు పిచ్చి అని చెప్తుంది. దీంతో వల్లభ మాకే మెంటల్ వచ్చేలా ఉంది. బామ్మకు పిచ్చి రాదా అంటాడు. దీంతో రత్నాంభ.. వల్లభను తిడుతుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?