BigTV English

Nindu Noorella Saavasam Serial Today January 1st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   నిజం చెప్పిన మిస్సమ్మ –  షాక్‌ అయిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today January 1st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   నిజం చెప్పిన మిస్సమ్మ –  షాక్‌ అయిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today Episode : హారతి ఇచ్చిన తర్వాత ఆరు ఫోటో చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. భయంతో స్పృహ కోల్పోబోతుంటే అందరూ పట్టుకుంటారు. ఇంతలో తేరుకున్న మిస్సమ్మ ఆరు ఫోటోను చూస్తూ తనతో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది చెప్పండి అని అడుగుతుంది. లోపల నుంచి మిస్సమ్మ అరుపు విన్న మనోహరి అయ్యో అని తల పట్టుకుంటుంది. మిస్సమ్మ వెంటనే అమర్‌ దగ్గరకు వెళ్లి ఏవండి మీరైనా చెప్పండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు..? అని అడుగుతుంది. ఏంటి మిస్సమ్మ కొత్తగా అడుగుతున్నావు అక్కడ ఉన్నది ఈ ఇంటి పెద్ద కోడలు అని శివరాం చెప్పగానే ఆ ఫోటోలో ఉన్నది ఆరు అక్కేనా..? అని అడుగుతుంది.


అవును మిస్సమ్మ.. అని అమర్‌ చెప్పగానే ఎందుకు మిస్సమ్మ అలా అడుగుతున్నావు. ఆ ఫోటో నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు కదా అని నిర్మల అడగ్గానే చూడటం కాదు అత్తయ్యా మాట్లాడుతున్నాను కూడా అని మిస్సమ్మ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ.. నెలల ముందు చనిపోయిన మా మేడంతో నువ్వు రోజు మాట్లాడుతున్నావా..? అంటాడు రాథోడ్‌. అవును మిస్సమ్మ నువ్వు జోక్‌ చేయకు అంటుంది అంజు. అయ్యో అంజు నేను జోక్‌ చేయడం లేదు. ఇలాంటి విషయాలు నేను జోక్‌ చేయలేను.. అసలు రోజు నాతో మాట్లాడే పక్కింటి అక్క ఆరు అక్కా ఒక్కరే ఎలా అయ్యారు అంటూ ఏడుస్తుంది మిస్సమ్మ.. దీంతో అమర్‌ ఎమోషనల్‌గా ఏంటి మిస్సమ్మా నువ్వు చెప్పేది.. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన పక్కింటి అక్కా నా ఆరునా..? అంటూ అడుగుతాడు.

మిస్సమ్మ ఫ్లీజ్‌ మిస్సమ్మ నిజం చెప్పు మిస్సమ్మ అనగానే నిజమండి నేను చెప్పేది అంటూ కుప్పకూలిపోతుంది.. దీంతో అంజు పక్కన కూర్చుని నా బర్తుడేకు హ్యాపీ ప్యారెట్‌ ఇవ్వడం.. నాకు అమ్మకు మాత్రమే తెలిసినవి పక్కింటి అక్కకు తెలిసింది అని చెప్పడం పక్కింటి అక్క గురించేనా.. అని అడుగుతుంది. నేను నిన్న చూసినప్పుడు నువ్వు మాట్లాడింది కూడా మా అమ్మతోనేనా..? అని అమ్ము అడగ్గానే అవునని చెప్తుంది మిస్సమ్మ అలాగే ఇన్ని రోజులు అక్క ఈ ఇంటి చుట్టు ఎందుకు తిరుగుతుంది. ఈ ఇంటికి కష్టమొస్తే ఆవిడకు ఎందుకు కన్నీళ్లు వచ్చాయో.. ఇప్పుడు నాకు అర్థం అయింది. మీరు ప్రమాదంలో పడ్డ ప్రతిసారి ఆవిడ ఎందుకు ప్రత్యక్షమయ్యేదో ఇప్పుడు అర్థం అయింది. మీకోసమే వచ్చేది..మీ మీద ప్రేమతోనే అక్క వచ్చేది మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చేతి అని చెప్పగానే.. అసలు అరుంధతి నీకు కనిపించడం ఏంటి మిస్సమ్మ అని నిర్మల అడగ్గానే.. ఏమన్నారు అత్తయ్యా అని అడుగుతుంది మిస్సమ్మ..


అదేనమ్మా అరుంధతి నీకు కనిపించడం ఏంటని అనగానే ఏంటి ఆరు అక్కా పూర్తి పేరు అరుంధతియా.. అని మిస్సమ్మ అడుగుతుంది. అవునని అంజు చెప్తుంది. దీంతో ఆరు తనకు కొడైకెనాల్‌ లో ఉన్నప్పుడు ఫోన్‌ చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఈవిడ అరుంధతినా.. నేను కొడైకెనాల్‌ వచ్చి కలవకుండా పోయింది ఈ అక్కనేనా..? అని అమర్‌ను అడుగుతుంది. అమర్‌ అవును మిస్సమ్మ అని చెప్పగానే.. మిస్సమ్మ బాధపడుతూ కూలబడిపోతుంది. నువ్వు మా అమ్మను కలవడానికి కొడైకెనాల్ ఎందుకు వచ్చావు అని అడుగుతూ మా అమ్మ ఎంతగానో అభిమానించే ఆర్‌జే భాగీ అంటే మీరేనా అని అడుగుతుంది. అవునని మిస్సమ్మ చెప్పగానే పిల్లలు  అందరూ ఏడుస్తూ మిస్సమ్మను హగ్‌ చేసుకుంటారు.

ఇంతలో రాథోడ్‌ అవును మిస్సమ్మ ఇప్పుడు ఆరు మేడం ఫోటో ఇప్పుడే చేశాను అన్నావు. ఇంతకు ముందు ఎప్పుడో మేడం ఫోటో చేశానన్నావు అని అడగ్గానే అప్పుడు నాకు మనోహరి గారు ఎవరిదో ఫోటో చూపించి అదే ఆరు అక్కా ఫోటో అని చెప్పింది అనగానే అందరూ షాక్‌ అవుతారు. రూంలోంచి అంతా వింటున్న మనోహరి షాక్‌ అవుతుంది. అప్పటి నుంచి ఆవిడే ఆరు అక్కా అనుకున్నాను అని చెప్పగానే అమర్‌ కోపంగా ఆరు ఫోటో అడిగితే వేరే వాళ్ల ఫోటో చూపించిందా..? అంటూ గట్టిగా మనోహరిని పిలుస్తాడు అమర్‌. ఏమీ తెలియనట్టు బయటకు వస్తుంది మనోహరి. ఏమైంది అమర్‌ ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది.

మిస్సమ్మ ఆరు ఫోటో అడిగితే వేరే వాళ్ల ఫోటో చూపించావా..? చెప్పు మనోహరి అని అమర్‌ గట్టిగా అడగ్గానే.. చెప్తాను అమర్‌.. చెప్తాను.. అనగానే చెప్పమ్మా ఏ దురుద్దేశంతో మిస్సమ్మకు వేరే ఫోటో చూపించావు అంటూ నిర్మల అడుగుతుంది. వెంటనే మిస్సమ్మ తను మాట్లాడుతుంది ఆరుతో అని నిజం తెలియకూడదని అలా చెప్పాను అంటుంది. దీంతో అమర్‌ కోపంగా మనోహరి చెంప పగులగొడతాడు. వెంటనే మనోహరి ఉలిక్కి పడి నిద్ర లేస్తుంది. అయ్యో ఇదంతా కలా అనుకుంటుంది.

ఇంట్లో అందరూ ఆస్థికలు కనిపించడం లేదని ఇళ్లంతా వెతుకుతుంటారు. మనోహరి వచ్చి ఏమైందని అడుగుతుంది. అమర్‌ కోపంగా ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఆరు ఆస్థికలు కనిపించడం లేదు అని చెప్తాడు. అందరూ టెన్షన్‌ పడుతుంటారు. తర్వాత ఘోర పూజలు చేస్తుంటాడు. మనోహరి.. ఘోర దగ్గరకు వచ్చి ఏం చేశావు.. ఘోర రాత్రికి రాత్రి ఇంటికి వచ్చి ఆస్థికలు దొంగిలించావు ఈ విషయం అమర్‌ కు తెలిస్తే నిన్ను నన్ను ప్రాణాలతో వదలడు అని తిడుతుంది. దీంతో ఘోర కోపంగా ఆ అస్థికలు ఎవరు తీసుకెళ్లారు మనోహరి.  నేను రాత్రి అసలు ఆ ఇంటికే రాలేదు. అమర్‌ కంట పడితే నా చావు నేను కొనితెచ్చుకున్నట్లే కదా అంటాడు. ఘోర మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Big Stories

×