Nindu Noorella Saavasam Serial Today Episode : రూంలోకి వెళ్తు్న్న రామ్మూర్తి దగ్గరకు వెళ్లిన మిస్సమ్మ అక్క అచూకి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. తెలియలేదు అని అక్క మనకు అందనంత ఎత్తులో చేరుకోలేనంత దూరంలో ఉంది అమ్మా అంటాడు రామ్మూర్తి. ఏంటి నాన్నా.. అక్క గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అడిగితే నాకేం తెలియదంటున్నారు అని మిస్సమ్మ అడగ్గానే… ఎక్కడుందో ఎలా ఉందో తెలియని మీ అక్కను చేరుకోవడం అంత ఈజీ కాదమ్మా.. విడదీసిన ఆ విధే మళ్లీ కలపాలి అని రామ్మూర్తి చెప్పగానే లేదు నాన్నా మీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది.
చెప్పండి నాన్నా అసలు ఏం జరిగింది అని మిస్సమ్మ అడగ్గానే.. మిస్సమ్మ నువ్వు లేనిపోనివి ఊహించుకుని మీ నాన్న మనసును ఇబ్బంది పెట్టకు అంటాడు అమర్. లేదండి మిమ్మల్ని మీ నాన్న మాటలు చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది అంటూ నిజం చెప్పండి నాన్నా అసలేం జరిగింది అని అడుగుతుంది. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారంట అందుకే అలా అన్నాను అని రామ్మూర్తి చెప్పగానే.. అక్క ఎంత దూరంలో ఉన్నా తెలిస్తే ముందు నేనే వెళ్తాను అని మిస్సమ్మ చెప్పగానే.. వద్దమ్మా నువ్వు అలా మాట్లాడకు.. తల్లి అంటాడు రామ్మూర్తి డల్లుగా మిస్సమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రామ్మూర్తి ఏడుస్తూ అమ్మాయి ఫోటోను ఆస్తికలను ఒక్కసారి ముట్టుకోవచ్చా అని అడుగుతాడు. సరే అంటాడు అమర్.
ఆరు రామ్మూర్తి మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. గుప్త వచ్చి నీకు ఎప్పుడో చెప్పాను కదా బాలిక. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని నువ్వు తెలుసుకున్న నిజం నీకు బాధను, కష్టాన్ని ఇస్తుంది. ఇక నువ్వు ఈ నిజాన్ని మోయక తప్పదు. నీకే ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పుకో బాలిక అని గుప్త చెప్పగానే.. ఒక గంటే నేను ఈ నిజాన్ని మోయలేకపోతున్నాను. ఆయన ఒక్కరే ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎలా మోయగలిగారు. మా ఆయనతో సంతోషంగా ఉన్నా.. నా పిల్లలతో హ్యాపీగా ఉన్నా మనసులో ఎప్పుడూ ఏదో వెలితిగా ఉండేది. కానీ మొదటి సారి నా చెల్లి మాట విన్నప్పుడు చాలా సంతోషం వేసింది.
నా కుటుంబాన్ని తనది అనుకున్నప్పుడు ఏ జన్మ రుణమో అనుకున్నాను కానీ ఈ జన్మ రక్తసంబంధం అనుకులేదు.. దేవుడు చాలా దుర్మార్గుడు గుప్త గారు.. నాకు ద్రోహం చేసినప్పుడు కూడా దేవుడి మీద నాకు కోపం రాలేదు. కానీ భాగుమతి నా చెల్లెలు అని తెలిశాక దేవుడంటే ఇప్పుడు కోపంగా ఉంది. మనసారా ఆ దేవుడిని తిట్టాలని ఉంది. అంటూ ఆరు ఏడుస్తుంటే.. బాలిక ఏమిటీ ఆ మాటలు.. జీవితమంతయూ దైవమును కొలిచి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. చావు ముందు నా చెల్లిని నా కళ్ల ముందుకు తీసుకొచ్చి కలవకుండా చేశాడు గుప్త గారు. ఎందుకు చేశావు దేవుడా ఇలాగా..? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని ఇలా చేశావు చెప్పు..
నా కుటుంబానికి ఎందుకింత కష్టాన్ని తీసుకొచ్చావు. అప్పుడు ఇప్పుడు నా తండ్రికి ఎందుకు ఇంత దుఃఖాన్ని ఇచ్చావు. బాలిక ఏడవకు.. నీ పతి దేవుడు నీ తండ్రిని.. నీ సోదరిని బాగా చూసుకుంటాడు. నువ్వు లేని లోటు లేకుండా చూస్తాడు అని గుప్త ఓదారుస్తాడు. మీ రుణ బంధం ఇంకా ఉంది కాబట్టి ఆ జగన్నాథుడు ఇలా చేశాడు.. అని గుప్త చెప్పగానే.. నాకు ఒక్కసారి బతకాలని ఉంది గుప్త గారు.. నాన్న వేలు పట్టుకుని బతకాలని ఉంది. చెల్లెలు వేలు పట్టుకుని తన కన్నీళ్లను తుడవాలని ఉంది. నేను కోల్పోయిన జీవితాన్ని పొందడం కోసం నాకు బతకాలని ఉంది. బాలిక అది అసంభవం. అసంభవం అని తెలుసు గుప్త గారు. కానీ మనిషిని కదా..? అంటూ ఏడుస్తుంటే.. గుప్త ఓదారుస్తూ.. ముందు ఇంటికి వెళ్దాం పద బాలిక అంటాడు.
అమర్ రూంలోకి వెళ్లిన రామ్మూర్తి, ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తుంటాడు. అమర్ ఓదారుస్తాడు. ఆరు ఆస్థికలు తాకి బోరున ఏడుస్తుంటాడు. రాథోడ్, అమర్ కూడా ఏడుస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?