BigTV English

Horoscope  Today March 12th: ఆ రాశి వారు ఇవాళ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి – వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

Horoscope  Today March 12th: ఆ రాశి వారు ఇవాళ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి – వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 12న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

వృషభం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.


మిధునం: బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి.

కర్కాటకం: కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహం:  వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

తుల: వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం: నూతన రుణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో  ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అదికమవుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి కొంత పెరుగుతుంది.

కుంభం: ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం: ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలుచేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Big Stories

×