Intinti Ramayanam Today Episode March 12 th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవిని కోసం అక్షయ్ దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. అవని నేను మీతో పాటు వస్తే బాగోదండి నన్ను ఏమని పరిచయం చేస్తారు అదే అత్తయ్య గారు వచ్చి నన్ను పిలిస్తే వాళ్లందరికీ నేనే కోడలునని పరిచయం చేస్తే నేను వస్తాను అని అప్పుడే అవని పెళ్లికి ఆ ఇంటి పెద్ద కోడలుగా నేను ఇంట్లోకి అడుగు పెడతానని అంటుంది. మీరు చెప్తే ఏం బాగుంటుంది అదే అత్తయ్య మామయ్య చెప్తే వాళ్లు వినడానికి కూడా బాగుంటుందని అవని అంటుంది. ఇక దయాకర్ స్వరాజ్యం కూడా పెళ్లికి తప్పకుండా వస్తామని చెబుతారు.. అవని కోసం నేను ఏమైనా చేస్తాను తప్పకుండా అమ్మ నాన్న ని పంపిస్తాను నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి అవని అని అక్షయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ అక్షయ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్షయ్ రాగని నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు ఏంటి అవని రాననిందా రాలేనని చెప్పిందా అనేసి అడుగుతుంది పార్వతి. దానికి అక్షయ్ ఇంటికి పెద్దవాళ్లయిన అత్తయ్య మామయ్య పిలవకుండా నేను ఎలా రావాలి అని చెప్పింది లేదంటే నేను రాను అనేసి అన్నది అని అక్షయ్ అంటాడు. ఇక పార్వతి వచ్చే చెప్పిన విషయాన్ని విని కోపడుతుంది. కమల్ వదిన రాకుంటే కచ్చితంగా పెళ్లి ఆగిపోతుందని చెప్పడంతో పార్వతి అవనీని కోడలుగా పరిచయం చేయడానికి ఒప్పుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి నేను ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఇప్పుడైతేనే నాకు కుదురుతుంది రేపు ఎలాగో పెళ్ళంటున్నారు కాబట్టి ఈరోజు ఇంట్లోంచి వెళ్లి పోతేనే నేను పెళ్లి చేసుకోగలను అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పలేను కాబట్టి ఒక లెటర్ రాసి నేను ఇంట్లోంచి ఈ రాత్రికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతుంది. ప్రణతి బాధపడుతూ లెటర్ రాయడం పల్లవి చూస్తుంది. ఇదేంటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలా లెటర్ వస్తుందా లేకపోతే ఇంకేదైనా రాసుకుంటుందని పల్లవి ఆలోచిస్తుంటుంది. ప్రణతిని పార్వతి పిలవడంతో ఆ లెటర్ ని తీసుకొని పల్లవి చదువుతుంది. ఒక అబ్బాయిని ప్రేమించింది అన్న విషయాన్ని అందులో రాసి ఉంటుంది. ఇది కథ నాకు కావాల్సింది ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి అవమానంగా ఫీల్ అవ్వడానికి ఇదే మెయిన్ అని పల్లవి అనుకుంటుంది.
ఇక ప్రియుడుతో ఎలాగైనా ఈ రాత్రికి వెళ్ళిపోవాలని ప్రణతి రాత్రి లేచి అందరూ ఉండరు కదా అని బయటికి వెళ్లాలనుకుంటుంది కానీ ఎదురుగా పల్లవి కనిపించి నిన్ను ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వను కదా అనేసి అనుకుంటుంది ప్రణతి పల్లవిని చూసి లోపలికి వెళ్తుంది ఉదయం 5:30 కి లేచి చూస్తే అప్పటికే అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు. ప్రణతిని రెడీ చేయడానికి తన ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. వాళ్ళందరిని చూసి ప్రణతి షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఇంట్లోంచి ఎలా వెళ్లాలి ఇంట్లోంచి తప్పించుకునే మార్గం లేదు నాకు వదిన ఉంటే ఏదో ఒక మార్గం చూపించేది అని ప్రణతి ఆలోచిస్తూ ఉంటుంది.
అటు పల్లవి అవని ఇంటికి రాగానే ఇంకెప్పుడు ఇంటికి రానివ్వకుండా గోరంగా అవమానించాలని పక్కా స్కెచ్ వేస్తుంది. బయట శ్రీకర్ కమల్ మా వదిన కోసం గ్రాండ్ గా వెల్కమ్ పలకాలని ఒక ముగ్గుని రెడీ చేస్తారు.. ఇంట్లోని వాళ్ళందరిని కమల్ బయటకు పిలుస్తాడు. నేను అవని వదిన కోసం వేసిన ముగ్గు ఎలా ఉందని అడుగుతారు. ఇదంతా ఏంట్రా నీ పార్వతి అరుస్తుంది. మన ఇంటి పెద్ద కోడలికి ఎంత గౌరవం ఇస్తున్నామో చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇది చూసి పెళ్లి వాళ్ళు ప్రణతిని తమ కోడలుగా గౌరవిస్తారు అని అంటారు. మీకేం పని పాట లేదా మాకు చాలా పనులు ఉన్నాయి పార్వతి అందరూ లోపలికి వెళ్తారు. రాజేంద్రప్రసాద్ మాత్రం కమల్ పై ప్రశంసలు కురిపిస్తాడు.
అక్షయ్, అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆటోలో అవని దయాకర్ స్వరాజ్యం ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి కమల్ శ్రీకర్ సంతోష్ పడతారు. మీరు వస్తారని ఇదంతా చేసాము వదిన ఎలా ఉంది అంటే అవని ఉండి ఇదంతా ఎందుకు కన్నయ్య అనగానే అక్షయ్ మరేం పర్లేదు అవని అని అంటాడు. ఇక కమల్ ఇంట్లో వాళ్ళందరిని పిలుస్తారు. ఈవిడ ఏమన్నా స్వర్గం నుంచి దిగొచ్చిందా అని కౌంటర్ వేస్తుంది. శ్రీకర్ కమలిద్దరూ ప్రియా పల్లవిలను హారతి తీసుకు రమ్మని చెప్తారు. ఈ హారతులు ఇవన్నీ నాకెందుకు కన్నయ్య అని అవై అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రణతి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది.. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..