Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 30 నుంచి ఏఫ్రిల్ 5 వరకు ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్య విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి.
వృషభం: చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించిన నిదానంగా మెరుగుపడుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
మిథునం: దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటకం: ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి.
సింహం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నూతన రుణాల కోసం ప్రయత్నిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
కన్య: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బందు,మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
తుల: చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లక్ష్యాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వృశ్చికం: వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.
ధనుస్సు: సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత వరకు ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బందువులతో వివాదాలు కొంత బాధిస్తాయి.
మకరం: బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. గృహ, వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతన విధులు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని పనులు వ్యయప్రయాసలతో పూర్తి కావు.
కుంభం: నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధు మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.
మీనం: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంట్లో శుభకర్యాలు నిర్వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుకుంటాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు