BigTV English

MI VS GT: తేలిపోయిన ముంబై బ్యాటర్లు… గుజరాత్ భారీ విజయం

MI VS GT: తేలిపోయిన ముంబై బ్యాటర్లు… గుజరాత్ భారీ విజయం

MI VS GT:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల ( Gujarat Titans vs Mumbai Indians ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium in Ahmedabad ) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సొంత గడ్డను గుజరాత్ టైటాన్స్ ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలోనే… సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ జట్టును తుక్కుతుక్కు చేసింది గుజరాత్ టైటాన్స్. ఏకంగా 36 పరుగుల తేడాతో… ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో రాణించిన గుజరాత్ టైటాన్స్… చివరికి విజయాన్ని కూడా దక్కించుకుంది. గుజరాత్ పై చేజింగ్ చేస్తున్న నేపథ్యంలో… 20 ఓవర్లాడిన ముంబై ఇండియన్స్ 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్.


Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

తేలిపోయిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవ్వాళ జరిగిన మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు… ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అలాగే ముంబై ఇండియన్స్ మరో ఓపెనర్ రికెల్టన్ 9 బంతులు ఆడి కేవలం 6 పరుగులు చేశాడు. ఇతను కూడా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చిన తిలక్ వర్మ అలాగే సూర్య కుమార్ యాదవ్ జట్టును గెలిపించే దిశగా… అడుగులు వేశారు.

Also Read: Csk fans: చెన్నై కెప్టెన్ రుతురాజుపై దారుణంగా ట్రోలింగ్… చెత్త నిర్ణయాలు అంటూ!

కానీ ఈ ఇద్దరినీ తెలివిగా ప్రసిద్ పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ( Tilak Verma ) 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. అటు సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav ) 28 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఒక బౌండరీ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా… ఇవాల్టి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్… భారీ స్కోరే చేసిందని చెప్పవచ్చు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. కాగా ఈ విజయంతో… గుజరాత్ ఖాతాలో రెండు పాయింట్లు పడ్డాయి. అటు ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×