Shower Routine Steps: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవుతారు. అయినప్పటికీ కొన్ని సార్లు ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్‌లో స్కిన్ నల్లగా మారుతుంది. అంతే కాకుండా నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి రోజు స్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసకోవాలి. అంతే కాకుండా ముఖం యొక్క సహజ కాంతిని కాపాడుకోవడానికి సహాయపడే కొన్ని సింపుల్ చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాటించాల్సిన చిట్కాలు:
కొబ్బరి నూనె వాడండి:
గ్లోయింగ్ స్కిన్ కోసం స్నానం చేసే ముందు కొబ్బరి నూనెతో మీ చర్మాన్ని తేలికగా మసాజ్ చేయండి. మీ చర్మాన్ని అందంగా.. మెరిసేలా చేసుకోవాలనుకుంటే, స్నానం చేసే ముందు కొబ్బరి నూనె వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా మృత కణాలు కూడా సులభంగా తొలగిస్తుంది. దీనివల్ల చర్మానికి సహజమైన మెరుపు కూడా వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి.. చాలా మంది కొబ్బరి నూనె వాడిన తర్వాత చర్మ సమస్యలను ఎదుర్కుంటారు. అలాంటి వారు కొబ్బరి నూనెను వాడకుండా ఉంటేనే మంచిది.
ఫేస్ వాష్:
చాలా మందికి ముఖం పదే పదే కడుక్కోవడం అలవాటు ఉంటుంది. ఇందుకోసం తరచుగా సబ్బు ఉపయోగించే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా మారిపోదని గుర్తుంచుకోవాలి. సబ్బును పదే పదే వాడటం వల్ల చర్మంలోని సహజ నూనె తొలగిపోతుంది. దీని కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ముఖం యొక్క కాంతి తగ్గుతుంది. ముఖం శుభ్రం చేసుకోవడానికి ఫేస్ వాష్ వాడటం మంచిది. మీకు సరైన ఫేస్ వాష్‌ను ఎంచుకోవాలనుకుంటే.. మీరు నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు.
శుభ్రమైన ముఖం:
రోజంతా ఆఫీసులోనే ఉండేవారు లేదా ఇంటి పనుల్లో బిజీగా ఉండేవారు తరచుగా రాత్రిపూట ముఖం శుభ్రం చేసుకోరు. ఇది చాలా తప్పు. దుమ్ము, కాలుష్యం కూడా ముఖాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా.. రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తద్వారా దుమ్ము , కాలుష్యం వల్ల కలిగే చర్మ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. మీరు మేకప్ వేసుకుంటే.. రాత్రి పడుకునే ముందు దానిని పూర్తిగా శుభ్రం చేసుకోండి.
Also Read: రోజూ 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే.. ఇన్ని లాభాలా ?
ఫేస్ మాస్క్ వేసుకోండి:
ముఖం యొక్క మెరుపును కాపాడుకోవడానికి. వారానికి రెండుసార్లు ఫేస్ మాస్క్ వాడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫేస్ మాస్క్ వాడటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ఇవి మీ చర్మానికి సహజమైన మెరుపు అందిస్తాయి. మీరు మీ ముఖానికి మాస్క్ వేసుకోవాలనుకుంటే.. సహజ పదార్థాలతో కూడా ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు మార్కెట్లో లభించే ఫేస్ మాస్క్‌లను కూడా ఉపయోగించవచ్చు.
మేకప్ వేసుకునే ముందు మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. రాత్రి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తొలగించడం మర్చిపోవద్దు. దీని తర్వాత.. మీ ముఖానికి మాయిశ్చరైజర్ క్రీమ్ రాయండి. ఎక్కువ మేకప్ వేసుకోవడం కూడా మానుకోండి.