BigTV English

Weekly Horoscope: నూతన వాహన యోగం ఉన్నది – నిరుద్యోగులకు ఇంటర్వూలలో విజయం

Weekly Horoscope: నూతన వాహన యోగం ఉన్నది – నిరుద్యోగులకు ఇంటర్వూలలో విజయం

Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 11 నుంచి మే 17 వరకు  ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. జీవిత బాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

వృషభం: చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.


మిథునం: కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం: నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు.

సింహం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.   ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది.

కన్య: ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.   స్ధిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి.  ఉద్యోగస్థులకు స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

 

ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?

 

తుల: ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.   సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి.  నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయట పడతారు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాల్లోని సమస్యలను రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

ధనుస్సు: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు నుండి బయటపడతారు. సోదరుల నుండి స్థిరాస్థి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.  గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

కుంభం: ఇంట్లో కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చ గలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో రాజీ పడతారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రంగాల వారు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×