OTT Movie : హారర్ సినిమాలను చాలా మంది ఒంటరిగా చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత ధైర్యం చాలామందికి ఉండదు. పగలు ఓ మాదిరిగా చూడగలుగుతారేమోగాని, రాత్రిపూట వీటిని ఒంటరిగా చూస్తే ప్యాంట్ తడిచిపోవడం గ్యారంటీ. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ఒక స్మార్ట్ ఫోన్ లో ఉండే దుష్ట శక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
తేజస్విని అనే యువతి వ్యాపారవేత్తగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో సమయం ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. ఆమె జీవితం ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె రోజువారీ కార్యకలాపాలను నిరంతరం రికార్డ్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక సారి ఆమె స్మార్ట్‌ఫోన్ ను పోగొట్టుకుంటుంది. అ తర్వాత, ఆమె చౌకగా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తుంది. అయితే కొత్త ఫోన్‌తో ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ కొత్త ఫోన్‌లో ఒక దుష్ట శక్తి ఉందని తెలుస్తుంది. ఇది తేజస్వినిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఫోన్ ద్వారా ఆమె అనేక సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆమెతో పాటు, ఆమె చుట్టూ ఉన్నవారికి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రమాదం తెచ్చిపెడుతుంది.
ఈ ఫోన్‌లోని ఒక మాగ్నెటిక్ చిప్ ఒక ఉగ్రవాదితో సంబంధం కలిగి ఉందని, అతని వల్లే ఈ దుష్ట శక్తి ఫోన్ లో ఉందని తెలుస్తుంది. తేజస్విని తన స్నేహితుడు ఆంటోనీ, శాస్త్రవేత్త అయిన క్లెమెంట్ సహాయంతో ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. సాంకేతికతను ఉపయోగించి, వాళ్ళు ఈ దుష్ట శక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఆ దుష్ట శక్తిని వీళ్ళు ఎదుర్కుంటారా ? ఉగ్రవాదికి, ఫోన్ కి ఉన్న సంబంధం ఏమిటి ? ఆ ఫోన్ వల్ల ఇంకా ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ప్రేమికుల మధ్య రిజర్వేషన్ చిచ్చు… ఐఏఎస్ కలలను పక్కన పెట్టి రాజకీయ గందరగోళంలో కొట్టుకుపోయే అమాయకుడు
జియో హాట్ స్టార్ (Jio hotstar)
ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘చతుర్ ముఖం’ (Chatur Mukham). 2021 లో వచ్చిన ఈ మూవీకి రంజీత్ కమల శంకర్, సలీల్ దర్శకత్వం వహించారు. ఇందులో మంజు వారియర్, సన్నీ వేన్, అలెన్సియర్ లే లోపెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే పరిణామాలతో తెరకెక్కింది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.