BigTV English

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు

Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 25 నుంచి మే 31 వరకు  ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.  సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. నిరుద్యోగులకు అవకాశములు  దూరమవుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

వృషభం: ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శిస్తారు. బంధు మిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.


మిథునం: కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఇంట్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులు ఆశించిన పదవులు పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులు, మిత్రులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నష్టాలను అదిగమించి లాభాలు పొందుతారు.

సింహం: ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆప్తుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘాకాలిక సమస్యలు తొలగుతాయి.

కన్య: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ఊహించని విధంగా సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు సాగిస్తారు. సంతాన వివాహయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి నూతన లాభాలు అందుకుంటారు.

 

ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?

 

తుల: కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా ముందుకు సాగుతారు.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో పురోగతి కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగి విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అన్ని విధాలా కలసివచ్చే కాలం.

ధనుస్సు: వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు సంతృప్తినిస్తాయి. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి.

మకరం: ముఖ్యమైన పనులు నిదానంగా సాగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

కుంభం: ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్నేహితులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. భూవివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి. కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×