BigTV English

Vishal : హీరో విశాల్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..? నెల్లూరుతో సంబంధం ఏంటి..?

Vishal : హీరో విశాల్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..? నెల్లూరుతో సంబంధం ఏంటి..?

Vishal : ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ గురించి అందరికీ తెలుసు. సెల్యూట్ లాంటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. రెండు దశాబ్దాల క్రితం ప్రేమ చదరంగం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విశాల్ కంటే ఎక్కువగా రీమా సేన్, భరత్‌లకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది.. ఈ సినిమా హిట్ అయిన కూడా విశాల్ కి పెద్దగా పేరు రాకపోవడంతో అంతగా క్లిక్ ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత పందెంకోడి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. సినిమాలు పరంగా సక్సెస్ అయిన ఈ హీరో లైఫ్ లో ఇప్పటివరకు పెళ్లి అనే మాట రాలేదు. రీసెంట్ గా ఆయన పెళ్లి పీటలు ఎక్కువ పోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరోయిన్ తో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ ఆస్తులు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


విశాల్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

కోలీవుడ్ హీరో విశాల్ ఆస్తులు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. హీరో గానే కాదు సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక విశాల్ ఒక్కో సినిమా చేయడానికి రూ.4 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఒకప్పుడు కోలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒక్కడిగి నిలిచిన విశాల్, వరుస పరాజయాలతో క్రేజ్ కోల్పోయాడు. దాంతో ఇప్పుడు తక్కువగా ఆస్తులు ఉన్నాయని టాక్.. ఆయన దగ్గర కేవలం 25 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. 2013లో ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ బ్యానర్ స్థాపించిన విశాల్, హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులనే ఫేస్ చేశాడు..విశాల్ గ్యారేజీలో ఖరీదైన కార్లు.. విశాల్‌కి కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే విశాల్ గ్యారేజీలో 5 ఖరీదైన కార్లు ఉన్నాయి..


సినిమాల విషయానికొస్తే.. 

తమిళ హీరో విశాల్ అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి.. ఆయన తండ్రి జీ. కే. రెడ్డి బిజినెస్‌మ్యాన్.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకి చెందిన జీ.కే. రెడ్డి, భార్య జానకి దేవీతో కలిసి చెన్నైకి మకాం మార్చారు. అక్కడే 1977లో విశాల్ జన్మించాడు.. తన అన్న విక్రమ్ భార్య శ్రియ రెడ్డితో కలిసి పొగరు అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి టాక్ మీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. విశాల్ అన్న విక్రమ్ కుమార్ నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేశాడు విశాల్. ఆ తర్వాత స్వయంగా నిర్మాతగా మారి, ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ పేరుతో బ్యానర్ స్థాపించి సినిమాలు తీశాడు. ‘వాడు-వీడు’, ‘అభిమన్యు’, ‘డిటెక్టివ్’, ‘మార్క్ ఆంటోనీ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు మంచి సక్సెస్ ను అందించాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తున్నాడు. ఇది గతంలో విశాల్ కి ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. పెళ్లి పీటల వరకు వెళ్లిన ఆ జంట ఏమైంది తెలియదు కానీ విడిపోయారు. ఇక హీరోయిన్ ధన్సిక తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×