E-Paper
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారు గణపతిని పూజిస్తే మెరుగైన ఫలితాలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారు గణపతిని పూజిస్తే మెరుగైన ఫలితాలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి కలిస్తోచ్చే అవకాశం ఉందనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన కీలక పనులను సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతిని పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ప్రయాణాలు అనూకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

మిథునం:

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదురైనా చిత్తశుద్దితో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. ఉద్యోగాల్లో తోటి వారి సహకారంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. శ్రీరామ సందర్శన శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కీలక వ్యవహారాల్లో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురైనా చివరి వరకు సంకల్ప బలంతో లక్ష్యాలను అందుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం కోల్పోకుండా పనులు పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలు ఎదరవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో సవాళ్లను ఎదుర్కొని పనులు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

కన్య:
ఈ రాశి వారికిఅనుకూలంగా ఉంటుంది. మీ రంగాల్లో ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో గైరవ ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు.ఆరోగ్యంపైశ్రద్ధ తీసుకోవాలి.ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో లాభనష్టాలు ఉంటాయి.ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. నూనత ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు విఫలం కావొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ప్రశాంతత కోసం ఈశ్వర సంర్శనం శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దల సలహాలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇష్టదైవ నామస్మరణతో మంచి ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు ఆలస్యం కావడంతో నిరుత్సాహం పొందుతారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడి విషయంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మకరం:
మకర రాశి వారికి మిశ్రము ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభకరం.

కుంభం:

కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది, దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారంలో అధిక ఆదాయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రీ మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

మీనం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి విపరీతమైన లాభాలు వరిస్తాయి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. శివాలయ సందర్శన శుభప్రదం.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×