BigTV English

Djokovic win gold medal: పారిస్ ఒలింపిక్స్, జకోవిచ్ బంగారం.. ఆపై కంటతడి..

Djokovic win gold medal: పారిస్ ఒలింపిక్స్, జకోవిచ్ బంగారం.. ఆపై కంటతడి..

Djokovic win gold medal: ఎట్టకేలకు సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ కోరిక నెరవేరింది. ఒలింపిక్స్ లో బంగారు పతకం అందుకోవాలన్న డ్రీమ్ సక్సెస్ అయ్యింది. ఫైనల్‌లో స్పెయిన్ యంగ్ స్టార్ అల్కరాస్‌ ను ఓడించి బంగారు పతకం ఎగురేసుకుపోయాడు జకోవిచ్. రేపోమాపో ఆయన రిటైర్మెంట్ చెప్పే యోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన మేజర్ టెన్నిస్ టోర్నీలో వెనుకబడ్డాడు ప్రపంచ నెంబర్ ఆటగాడు, సెర్బియా ప్లేయర్ నొవాక్ జకోవిచ్. ఆయన పనైపోయిందని అందరూ భావించారు. దీనికితోడు గాయాల సమస్య వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఆయన రిటైర్మెంట్ ఇస్తే బెటరనే టాక్ నడిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో గాయం నుంచి వెనుదిరిగాడు. వింబుల్డన్‌ ఫైనల్‌లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఒలింపిక్స్‌లో బంగారు పతకం అందుకోవాలన్న జకోవిచ్ కోరిక నెరవేసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్-టూల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్‌ను ఓడించి జకోవిచ్ బంగారు పతకం అందుకున్నాడు.


ALSO READ:  సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్.. కాంస్యంపై ఆశలు సజీవం

ఇద్దరు ఆటగాళ్లు కొదమసింహాల మాదిరిగా తలపడ్డారు. ఎవరి ఎత్తులు వాళ్లు వేస్తూ పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. చివరకు రెండు సెట్లు టై బ్రేక్‌కు దారి తీసింది. రెండింటిలోనూ పైచేయి సాధించాడు జకోవిచ్. దీంతో క్లో కోర్టులో తనకు ఆడే సత్తా ఇంకా ఉందని నిరూపించుకున్నాడు.

కెరీర్ ముగిస్తుందన్న సమయంలో గోల్డ్ మెడల్‌ సాధించాలన్న జకోవిచ్ ఆశ నెరవేరింది. అల్కరాస్‌పై గెలిచాక భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడాయన. ఫ్యామిలీ సభ్యులు, కోచ్ వద్దకు వెళ్లి కన్నీరు పెట్టాడు. టెన్నిస్‌లో మేజర్ టోర్నీల్లో విజేతగా నిలిచిన జకోవిచ్, చివరకు ఒలింపిక్స్‌లో చెమటోడ్చినెగ్గాడు. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ రజతం సరిపెట్టుకున్నాడు. మరో ఆటగాడు ముసెట్టి కాంస్యం గెలుచు కున్నాడు.

https://twitter.com/TommyBeer/status/1820114517793055065

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×