BigTV English

Naga Sadhus: నాగ సాధువులుగా ఎలా మారుతారు? వారికి సంబంధించిన విశేషాలు ఇవిగో

Naga Sadhus: నాగ సాధువులుగా ఎలా మారుతారు? వారికి సంబంధించిన విశేషాలు ఇవిగో

మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. నాగసాధువులు నిండుగా కనిపిస్తున్నారు. మహా కుంభమేళాకు వెళ్లిన వారంతా నాగ సాధువులను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మహా కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అసలు నాగ సాధువులు ఎవరు? నాగసాధువులుగా మారడం ఎలా వంటివి తెలుసుకుందాం.


నాగ సాధువుగా మారడం అంత సులువైన పద్ధతి కాదు. ఎన్నో పరీక్షలను తట్టుకొని నిలబడాలి. ముందుగా తనకు తానే పిండదానం చేసుకోవాలి. తర్పణం వదిలేయాలి. అంటే అతని మనసులో వైరాగ్యం నిండిపోయిందని చూపించాలి. నాగ సాధువుగా మారడానికి ముందు అఖారాకు వెళ్లాలి.

అఖారా అంటే నాగసాధువులు ఉండే ప్రాంతం. అఖారాలోకి అందరికీ ప్రవేశం ఉండదు. ముందుగా నాగ సాధువుగా మారాలనుకుంటే అఖారాల్లో ఉండే పెద్దలు అతను ఏ కుటుంబానికి చెందినవాడు, అతని కుటుంబ పరిస్థితి ఏమిటి, ఎందుకు నాగ సాధువుగా మారాలనుకుంటున్నాడు వంటివి తెలుసుకుంటారు. అఖారాల్లోకి ప్రవేశం లభించాక బ్రహ్మచర్య దీక్షను చేపట్టాల్సి వస్తుంది. ఆరు నుంచి 12 సంవత్సరాల పాటు ఆ దీక్షను చేపట్టాలి. ఆ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత అఖారా అధిపతి ఆ వ్యక్తి కామకోరికల నుండి విముక్తుడయ్యాడని నమ్ముతారు. అప్పుడే తర్వాత ప్రక్రియకు వెళతారు.


రాత్రి రెండు గంటల నుంచి రెండున్నర గంటల మధ్య అత్యంత ప్రశాంతమైన సమయంలో నాగ సాధువుల దీక్ష మొదలవుతుంది. దాదాపు 48 గంటల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ మంది సాధువులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో ఆయుర్వేద మూలికలను అందిస్తూ ఉంటారు.

నాగ సాధువులు రోజుకు 7 ఇళ్లల్లో మాత్రమే భిక్షాటన చేయాలి. ఆ ఇళ్లల్లో బిక్ష లభించకపోతే ఆహారం తినకుండా పస్తులు ఉండాల్సిందే. అలాగే నాగ సన్యాసులు రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని భుజించాలి. నాగ సాధువులు అంతా వేరు వేరు అఖారాలలో జీవిస్తూ ఉంటారు. ఆది గురు శంకరాచార్యులు అఖారాలో నాగ సాధువులు ఉండాలన్న సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెప్పుకుంటారు.

నాగ సాధువులు ఎప్పుడూ బట్టలు ధరించరు. ఎందుకంటే బట్టలు ఆడంబరానికి, ప్రాపంచిక జీవితానికి చిహ్నంగా పరిగణిస్తారు. తమ శరీరాన్ని కప్పుకోవడానికి బూడిదను మాత్రమే రాసుకుంటారు. అలాగే నాగ సాధువులు కేవలం నేలపైనే నిద్రపోవాలి. ఎలాంటి మంచాలు ఉపయోగించకూడదు.

నాగ సాధువులుగా మారిన వారు సమాజంలోని ప్రజల ముందు తలవంచేందుకు ఇష్టపడరు. కానీ వారి సీనియర్ నాగసాధువుల ముందు మాత్రం ఆశీర్వాదం కోసం తలవంచాల్సిందే. అన్ని నియమాలు పాటించాకే ఆ వ్యక్తి నాగసాధువుగా మారుతాడు. పండ్లు ఆకులు వంటివి కూడా తిని బతికే నాగ సాధువులు ఎంతోమంది ఉన్నారు. నాగ సాధువుగా మారడం అనేది సులభమైన ప్రక్రియ మాత్రం కాదు. ఎంత చలివేస్తున్నా ఒంటిమీద ఎలాంటిది కప్పుకోకూడదు.

నాగ సాధువులు మరణించాక సాధారణ మనుషుల్లాగా వారికి దమన కార్యక్రమాలు చేయరు. తమ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ధ్యానస్థితిలో కూర్చుంటారు. అలా ధ్యానస్థితిలోనే వారి శరీరాలను భూమి కింద పాతి పెడతారని చెప్పుకుంటారు. మరొక ఆచారం ప్రకారం వారి శరీరం పవిత్ర నదుల్లో కలిపేస్తారని కూడా అంటారు.

నాకు సాధువులు భౌతిక సుఖాలను వదిలివేస్తారు. కానీ హిందూ దేవాలయాలను కాపాడేందుకు మాత్రం ముందుంటారు. అందుకే హిందూ దేవాలయాలు రక్షించేందుకు యోధుల్లాగా ప్రవర్తిస్తారు.

Also Read: అఖారా అంటే ఏమిటి ? కుంభమేళాలో అఖారాల ప్రాముఖ్యత !

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×