Heroine Laila: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే తరచుగా వినిపించే అంశం క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి, తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ధైర్యంగా చెప్పుకుంటున్నారు. దీనికి కారణం మలయాళం ఇండస్ట్రీలో వేసిన జస్టిస్ హేమా కమిటీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా పని ప్రదేశాలలో ఆడవారికి భద్రత లేదు అని, ఆ కమిటీ వెల్లడించింది. అందుకే చాలామంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, లేడీ నటీమణులంతా కూడా చాలామంది ఈ విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ ధైర్యంగా ముందుకొచ్చి తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు ముసిముసి నవ్వులతో ఆకట్టుకుంటూ.. సొట్టబుగ్గల సుందరిగా పేరు సొంతం చేసుకున్న లైలా (Laila).
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న లైలా..
వాస్తవానికి ఒకప్పుడు తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా చలామణి అయిన లైలా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తెలుగుతోపాటు తమిళ్లో కూడా సత్తా చాటింది. ఆ తర్వాత సినిమాలు తగ్గించిన ఈమె ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. ఇక ఈమధ్య స్టార్ హీరోల సినిమాలలో పవర్ఫుల్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ (jabardast) వంటి కార్యక్రమాలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ భారీగా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఆ దర్శకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు..
ఇకపోతే మరోవైపు ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పొట్టి స్కర్ట్ లు, తక్కువ టాప్స్ వేసుకోమని అడిగే దర్శకులు ఎంతోమంది ఉన్నారు అని తెలిపింది. ముఖ్యంగా ప్యాడ్స్ పెట్టుకోమని కూడా దర్శకులు చెప్పారు అని లైలా ఊహించని కామెంట్లు చేసింది. అందుకు కుదరదు అని ఖరాకండిగా చెప్పేసిందట.ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. ఒక దర్శకుడు నాకు షార్ట్ స్కర్ట్ ఇచ్చి ధరించాలి, ఇది నీకు గ్లామర్ గా ఉంటుందని చెప్పాడు. ఇప్పటివరకు హోమ్లి క్యారెక్టర్లు చేశావు కదా.. ఇది కూడా ట్రై చెయ్ అన్నాడు. ఇక నేను పొట్టి స్కర్ట్ వేసుకున్నాను. అయితే నేను గ్లామర్ గా కనిపించడం లేదని, బొమ్మలా కనిపిస్తానని చెప్పాడు. నువ్వు వేసుకోమని అడిగినందుకే నేను వేసుకున్నాను అని చెప్పాను. కానీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. కొంతమంది గ్లామర్ పాత్రలు మాత్రమే పోషిస్తారు. అది వారి ఇష్టం. ప్రతి ఒక్కరికి బలాలు బలహీనతలు ఉంటాయి కదా.. అంటూ లైలా తెలిపింది. ప్రస్తుతం లైలా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను చాలామంది ఇలాంటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారని వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడు ఇటీవల స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఒక డైరెక్టర్ కూడా హీరోయిన్లపై, వారి శరీర ఆకృతులపై చేసిన కామెంట్లకు విమర్శల పాలయ్యి చివరికి క్షమాపణలు కూడా తెలిపారు. ఏది ఏమైనా ఆడవారికి పని ప్రదేశాలలో భద్రత లేదు అనడానికి నిదర్శనం అని చాలామంది మాటలే మనకు అర్థమవుతున్నాయని చెప్పవచ్చు.