Gundeninda GudiGantalu Today episode January 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు పాలు తాగడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తమ్ముడు శోభనానికి ఎందుకురా ఇంతగా అడ్డుపడుతున్నాడని అంటుంది. దానికి కోపడ్డ బాలు వాడిని ఇంట్లోకి రానీయడమే ఎక్కువ మళ్ళీ ఇదొకట అది కూడా నా.. నా రూమ్ లోనే అని శోభనం అనేసి వెళ్ళిపోతాడు. నేను పైకి వెళ్తున్నాను మీ చావేదో మీరు చావండి అని బాలు పైకి వెళ్ళిపోతాడు. బాలు దగ్గరికి రవి వస్తాడు. చూడగానే బాలు కోపంతో మాట్లాడుతాడు. నీవల్లే ఇదంతా జరిగింది మా పరువును తీసేసావ్ నాన్నకు గుండెపోటు రావడానికి నువ్వే కారణం అని నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడు. కొట్టడానికి ట్రై చేస్తాడు అంతలోకే మనోజ్ వచ్చి రవికి సపోర్ట్ చేస్తాడు.. నీవల్లే ఇంట్లో గొడవలు జరిగేది నువ్వు తాగొచ్చి నాన్నను రెచ్చగొట్టుకున్న అంటే అది జరిగేది కాదు అని మనోజ్ రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అది విన్న మనోజ్ ని కూడా కలిపి తిడతాడు. నీకు ఈ రోజు శోభనం కాదురా జరిగేది వేరేది జరుగుతుందని తన గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు బాలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. రవి శృతిల శోభనం కోసం ప్రభావతి హడావిడి చేస్తుంది. అస్సలు ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తాడు. మచ్చ చెప్పి బాలుని ప్రతిసారి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక బాలు రవి శృతిల శోభనం ఎలాగైనా జరక్కుండా ఆపాలని కంకర కట్టుకుంటాడు.. గదిలో స్వీట్లు పూలు అన్నీ రెడీ చేసి ప్రభావతి పెట్టేస్తుంది. ఈ బండోడు శోభనం గదిలోకి తీసుకెళ్లాల్సిన పాలను తాగినట్టే అక్కడ ఉన్న స్వీట్లు పండ్లు అన్ని తినేసాడేమో నేను వెళ్లి ఒకసారి చూసి వస్తానని ప్రభావతి అంటుంది. పైకెళ్లగానే ప్రభావతికి షాక్ తగులుతుంది. బాలు గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. మీనా ప్రభావతి దగ్గరికి వెళ్లి ఎందుకు అత్తయ్య అలా అరిచారని అడుగుతుంది. నీ గదిని ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఎందుకిలా నువ్వు తాళం వేసుకున్నావ్ అనేసి అరుస్తుంది ప్రభావతి. మీనా నేను మాత్రం వేయలేదు అత్తయ్య నాకు తెలియదు ఒకవేళ మీ అబ్బాయి ఏమైనా వేసారేమో అని అనుకుంటారు.
మీనా స్వీట్ లన్ని రెడీ చేసి పెట్టేస్తుంది. ఈ బండోడు పాలు తాగినట్లే ఆ స్వీట్లు ఎన్ని తినేసాడు ఏంటో వెళ్లి నేను చూసి వస్తానని ప్రభావతి పైకి వెళ్తుంది. మీనా వాళ్ళ గదికి తాళం వేసి ఉండడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది.. అసలు ఈ తాళం ఎవరేసారు ఎందుకేసారు వాళ్ళు వచ్చే టైం అయింది ముహూర్తానికి టైం అయినప్పుడు ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మీనా ఏమైనా గదికి తాళం వేసిందని ప్రభావతి మీనా ను అరుస్తుంది. మీనా వచ్చి అసలు గదికి తాళం ఎవరేసారు నేను వేయలేదు అత్తయ్య అనేసి అంటుంది. కానీ ప్రభావతి అస్సలు నమ్మదు. గదిలో శోభనం జరగడానికి ముందుగా ఒప్పుకొని ఇప్పుడు డ్రామాలాడుతున్నావా తాళాలు ఎక్కడ పెట్టావో తీసుకురా అనేసి మీనా పై అరుస్తుంది. నాకేం తెలియదు అత్తయ్య నేను అసలు తాళాలు వేయలేదు నేను మీతో పాటే ఉన్నాను కదా పైకి వచ్చాను అసలు అని మీనా అంటుంది. ఇక అత్త కోడలు ఇద్దరు ఆలోచనలో పడతారు. అసలు గదికి తాళం ఎవరు వేశారని ఆలోచిస్తూ బాలు వేశాడని అనుకుంటారు.
ఇక మీనా బాలు కోసం ఇల్లంతా వెతుకుతుంది.. ఆయన ఇంట్లో లేరు మరి తాళం వేసుకొని ఎక్కడికి వెళ్లారో తెలియదు అత్తయ్య అని ఇద్దరు కలిసి ఆలోచనలో పడతారు. ఇక బాలు దగ్గరకెళ్ళి ఎలాగోలాగా తాళం తీసుకొని వస్తారు. తాళం తెరిచి అన్ని సిద్ధం చేస్తారు ప్రభావతి మీనా. ఇక బయటకు వెళ్ళిపోతాడు బాలు.. రవి శృతిలను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ప్రభావతి కిందకు తీసుకొస్తుంది. బాలు ఎక్కడ అంటే బాలు బయట ఉన్నాడు మామయ్య అని మీనా అంటుంది. బాలుని మీనా బలవంతంగా లోపలికి తీసుకొని వస్తుంది. వాళ్లని ఆశీర్వదించాలి అని సత్యం అంటాడు. అది విన్న బాలు మీరందరూ ఉన్నారు కదా మంచివాళ్లు మీరు ఆశీర్వదిస్తే చాల్లే నేను ఎందుకు అని అనగానే శృతి మీరందరూ ఆశీర్వదించారు కదా ఇంకెవరి ఆశీర్వాదాలు కోసం నేను అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని శృతి అంటుంది. దానికి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక బాలు కోపం రెట్టింపు అవుతుంది. ఆంటీ అంకుల్ మీరు ఆశీర్వదించారు మాకు అదే చాలు. మేము ఆశీర్వాదాలు కోసం వేరే వాళ్ళని బెగ్ చేయాల్సిన అవసరం మాకు లేదని శృతి పొగరుగా అంటుంది.. దానికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక బాలు దానికి ఇంకా రెచ్చిపోయి అందరిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తాడు. ఇలా సపోర్ట్ చేయడం వల్లే ఈ పొగరు గల ఆవిడ ఇలా మాట్లాడుతుందని అంటాడు. పెద్ద చిన్న నేను మర్యాద కూడా లేకుండా ఎంత పొగరుగా సమాధానం ఇచ్చిందో చూసారా నాన్న అని అంటాడు. ఆ సురేంద్ర పొగరు కనిపిస్తుంది సురేంద్ర ముక్కు నుంచి ఊడి పడినట్లే ఉంది. మీకు కావాల్సింది ఇదే కదా అని బాలు సత్యం ను నిలదీస్తాడు. ఇక రవి కూడా శృతిని అరుస్తాడు. అందరి ముందర మాట్లాడలేక శృతి ఫీల్ అవుతుంది. బాలు మీనా ఇద్దరు ఆశీర్వదిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..