ఒక మనిషి జీవితంలో అంతిమంగా జరిగేది దహన సంస్కారాలు. అతడు మరణించిన తర్వాత అతడి పార్థివదేహాన్ని అగ్నిలో వేసి దగ్ధం చేస్తారు. భగవద్గీతలో కూడా ప్రపంచంలో ఎవరు పుట్టినా కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందేనని శ్రీకృష్ణుడు చెప్పాడు. అయినా సరే మన ప్రియమైన వ్యక్తులు మరణించినప్పుడు ప్రతి ఒక్కరికి కంటతడి కలుగుతుంది. సనాతన ధర్మంలో మరణించిన వ్యక్తికి సరైన కర్మలతో దహనం చేయాలి. అప్పుడు ఆ మృతదేహం కాలిపోయి బూడిదగా మారి మట్టిలో కలిసిపోతుంది.
అయితే దహన సంస్కారాలు చేసిన తర్వాత కూడా మనిషి శరీరంలో కాలిపోని శరీర భాగం ఒకటి ఉంది. అది ఏమిటో దాన్ని ఎలా ఏం చేస్తారో తెలుసుకోండి.పండితులు చెబుతున్న ప్రకారం మృతదేహాన్ని దహనం చేసినప్పుడు కొన్ని గంటల్లో ఎముకలతో సహా శరీరం మొత్తం ఖాళీ బూడిద అయిపోతుంది. కానీ ఒక శరీరంలోని ఒక భాగం మాత్రం కాలిపోకుండా అలాగే మిగిలిపోతుంది. అవే మానవ దంతాలు. ఎందుకంటే ఈ దంతాలు కాల్షియం ఫాస్పేట్ తో తయారవుతాయి. ఇది ఈ పదార్థం చాలా దృఢంగా ఉంటుంది. అగ్ని కూడా దానిని కాల్చలేదు.
దహన సంస్కారాలు చేసిన తర్వాత కూడా దంతాలు కాలిపోకుండా మిగిలిపోవడానికి ఇదే కారణం.సైన్స్ పరంగా చూస్తే దహన సమయంలో చితిలోని వేడి 1292 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. అంత వేడిని చర్మం, నరాలు, ఎముకలు ఏమీ తట్టుకోలేవు. అందుకే ఖాళీ బూడిదైపోతాయి. కానీ దంతాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. ఎనామిల్ అని పిలిచే ఈ కఠినమైన భాగం బూడిదలో వెతికితే దొరికిపోతుంది. దహనం చేసిన తర్వాత రెండు రోజులకు ఆ బూడిదను సేకరిస్తారు. అలా సేకరించినప్పుడు అందులో చిన్న చిన్న ఎముకల ముక్కలతో పాటు దంతాలు భాగాలను కూడా సేకరిస్తారు. వాటిని కుండలో నింపి గంగానదిలో లేదా మరేదైనా పవిత్రమైన నదిలో కలుపుతారు.
మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతిని ఇవ్వాలని కోరుతూ… గంగలో ఆ బూడిదను దంతాలను కలిపేస్తారు.దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి. ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత మరణిస్తే అతని దహన సంస్కారాలు ఆరోజు చేయరు. మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉంటారు. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేస్తే మరణించిన వ్యక్తికి మోక్షం లభించదు. అందుకే సరైన సమయాన్ని ఎంచుకునే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.
Also Read: ఈ విషయాలు తెలిస్తే చాలు.. కుంభమేళాకు ఈజీగా వెళ్లి రావొచ్చు
అలాగే మరణించిన వ్యక్తి దేహాన్ని ఒంటరిగా వదలరు. చుట్టూ అందరూ కూర్చుంటారు. దీనికి కారణం రాత్రి సమయంలో ఆ శరీరంలోకి చెడు ఆత్మ ప్రవేశించే అవకాశం ఉందనే నమ్ముతారు. అందుకే అలా చుట్టూ కూర్చోవడం ద్వారా ఆ ప్రదేశంలో చెడు ఆత్మలు తిరగకుండా అడ్డుకోవచ్చని భావిస్తారు. అలాగే మరణించిన వ్యక్తి దగ్గర దీపం కూడా వెలిగిస్తారు. దీనికి కూడా కారణం దుష్టాత్మలను దూరంగా ఉంచడమే.