Navpancham Yog 2025: గ్రహాల స్థితిని బట్టి కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు చాలా పవిత్రమైనవి. అంతే కాకుండా ఫలవంతం అయినవి కూడా. వీటిలో నవపంచమ యోగం కూడా ఒకటి. జాతకంలో ఏ గ్రహం అయినా తొమ్మిదవ , పంచమ ఇంట్లో ఉన్నప్పడు ఈ యోగం ఏర్పడుతుంది. అంతే కాకుండా తొమ్మిది, ఐదవ గృహాలు త్రిభుజ గృహాలుగా పరిగణించబడతాయి. వీటిని ఉత్తమ గృహాలు అని కూడా పిలుస్తారు. ఐదవ ఇల్లు విద్య, పిల్లలు, పూర్వ జన్మల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. తొమ్మిదవ ఇల్లు అదృష్టం అందుకే ఇక్కడ ఏర్పడే నవ పంచమ యోగం ముఖ్యంగా మానసిక. భౌతిక శ్రేయస్సు, విద్య, పిల్లల సంతోషం, జీవితంలో పురోగతికి శ్రేయస్కరం.
జనవరి 26 , 2025న ఆదివారం ఉదయం 5.21 గంటలకు శుక్రుడు, కుజుడు కలిసి నవ పంచమ యోగాన్ని ఏర్పరచనున్నాయి. గ్రహాల స్థితి ప్రకారం శుక్రుడు, తొమ్మిదవ ఇంట్లో , కుజుడు ఐదవ ఇంట్లో ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయిక వ్యక్తికి ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది. అంతే కాకుండా డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తి వ్యాపారం, వృత్తిలో పురోగతిని కూడా పొందుతారు. నవ పంచమ యోగం వ్యక్తికి అదృష్టాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయానికి దారితీస్తుంది.
శుక్రుడు, కుజుడు 5, 9 ఇండ్లలో ఉండి నవ పంచమ యోగాన్ని ఏర్పరచినప్పుడు అది చాలా శుభ ప్రదంగా పరిగణించబడుతుంది.ఈ యోగం ఒక వ్యక్తి జీవితంలో పురోగతిని తీసుకురావడమే కాకుండా అదృష్టాన్ని పెంచుతుంది. ఇదిలా ఉంటే ఈ యోగం మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ శుభ కలయిక 4 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.
మేష రాశి:
మేష రాశిని పాలించే గ్రహంగా కుజుడిని చెబుతారు. ఈ యోగం ప్రభావంతో మేష రాశి వారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా ఈ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కొత్త ప్రణాళికల్లో కూడా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వృషభ రాశి:
శుక్రుడు వృషభ రాశిని పాలించే గ్రహంగా చెబుతారు. ఈ యోగం వల్ల వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అంతే కాకుండా అవివాహితులు వివాహ అవకాశాలు కూడా పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా పూర్తవుతాయి. ఆస్తికి సంబంధించి లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
సింహ రాశి:
నవపంచమ యోగ ప్రభావం కారణంగా సింహ రాశి వారు తమ కెరీర్ లో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. అంతే కాకుండా మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందంతో పాటు శాంతి కూడా పెరుగుతుంది. ఆఫీసుల్లో ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త అవకాశాలు ఆర్థిక పరిస్థితిని కూడా బలోపేతం చేస్తాయి.
Also Read: ఈ విషయాలు తెలిస్తే చాలు.. కుంభమేళాకు ఈజీగా వెళ్లి రావొచ్చు
తులా రాశి:
తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు . ఈ యోగం వల్ల తులా రాశి వారికి అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాకుండా ధన లాభం కూడా లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది. మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు విజయ సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.