Women Murder: హైదరాబాద్‌లో వరుస దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలపై హత్యలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తరుచుగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఓ చోట మహిళలపై దారుణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
మేడ్చల్, మునీరాబాద్‌లో యువతి దారుణ హత్యకు గురైంది. 25 ఏళ్ల యువతిని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం నిందితులు యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హత్య చేయడానికి కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో మహిళల పట్ల హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను కిరాతకంగా హత మార్చి కుకర్లో ఉడికించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలోనే ఓ కిరాతకుడు 7 నెలల గర్భవతి అయిన తన భార్యపై కడుపుపై కూర్చొని దారుణంగా చంపాడు. రాష్ట్రంలో ఇలా వరుసగా ఏదో ఓ ఘటన జరుగుతూనే ఉంది. ఇలాంటి వరుస హత్యల పట్ల నగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు.
Also Read: Fake Currency Busted: హైదరాబాద్‌లో రూ.5లక్షల ఫేక్ కరెన్సీ.. నిందితుడు ARREST..!