Coconut : పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమేమీ కాదు. తెలిసి చేసిన పని కాదు. దేవాలయాల్లో కొట్టే కాయ కుళ్లితే వెంటనే నీళ్లతో శుభ్రం చేసి మళ్లీ మంత్రోచ్ఛాటన చేసి మరీ స్వామిని అలంకరిస్తారు. కుళ్లిన కాయ దోషమే కానీ ఇచ్చిన వ్యక్తికి సంబంధించినది కాదు. కొబ్బరి కాయ కుళ్లిపోతే చెడు జరగడం అనేది కేవలం అపోహమాత్రమే. బాధపడాల్సిన పనిలేదు.
ఇంట్లో పూజ చేసేటప్పడు కుళ్లితే తీసేసి కాళ్లు, చేతులూ, ముఖమూ కడుక్కుని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున మళ్లీ పూజ చేయటం మంచిదని పండితులు చెబుతుంటారు.
అదే వాహనానికి కొట్టే కాయ కుళ్లితే అంత దిష్టీ పోయినట్టే. అయినా మళ్లీ వాహనం కడిగి మళ్లీ కాయ కొట్టాల్సిందే. మనలో అనుమానం ఉంచుకోవడం కంటే మళ్లీ చేయటం మంచిది. వివాహం కాని వారికి కొబ్బరికాయలో పువ్వు రావడం వల్ల వివాహ ఘడియలు దగ్గర వస్తున్నాయని సంకేతం. అంతేకాకుండా కొబ్బరికాయ నిలువుగా పగలడం వల్ల వారికి సంతానం తొందరగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.