BigTV English

Bhagavad Gita : భగవద్గీతను ఆ పద్దతిలో పారాయణం చేస్తే నష్టం తప్పదా…?

Bhagavad Gita : భగవద్గీతను ఆ పద్దతిలో పారాయణం చేస్తే నష్టం తప్పదా…?

Bhagavad Gita : భగవద్గీతలాంటి గ్రంధాలను పారాయణం చేసే టప్పుడు కొన్ని నియామాలు పాటించాలని లేకపోతే నష్టం జరుగుతుందని కొందరు చెబుతుంటారు . ఒక్క విషయం భగవద్గీత లాంటివి శాప గ్రంధాలు కావు. ఏ రకంగా అయినా పారాయణం చేయవచ్చు. అయినా అది ఒక మతానికి చెందిన ఒక గ్రంధంగా భావించకూడదు. కొంతమంది ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో భగవద్గీతను వినిపిస్తుంటారు. కానీ అది సరి కాదు. భగవద్గీత నిత్య పారాయణ గ్రంధం. ప్రతీ రోజు చదవాలి, ప్రతీ ఒక్కరు చదవాలి. అనంతమైన వేదాంతమైన సారాంశాన్ని శ్రీకృష్ణుడు బోధించాడు


మానవత్వాన్ని, సమాజహితాన్ని , కర్మ పైన మనకు ఉండే అధికారాన్ని సవివివరంగా వివరించిన ఏకైక గ్రంధం భగవద్గీత. ప్రపంచ సాహిస్యంలో ఇదొక్కటే ఉంది. ఎవరు ఏ పని ఎలా చేయాలి..మనుష్యుల్లో ఎలాంటి వారు ఉంటారు..ఎటువంటి మనుషులు ఏ రకంగా ప్రవర్తిస్తారు..ఎటువంటి ఆహారాన్ని ఎవరు తీసుకోవాలి….ఎవరు ఎలా కూర్చోవాలో కూడా చెప్పే మనో వికాస, వ్యక్తిక్వ గ్రంధం భగవద్గీత.

సంప్రదాయం తెలిసిన వారు సనాతన ధర్మంలో ఉండేవారు ఉదయం లేవగానే భగవద్గీత పారాయణం చేస్తుంటారు. ప్రతీ రోజు ఉదయమే ఒక అధ్యాయమో, శ్లోకమే చదువుతుంటారు. మళ్లీ రాత్రి పూట పడుకునే మరో అధ్యాయం చదువుతుంటారు. ఇంకొంతమంది ఒక విశిష్టమైన తిథి రోజుల్లో సంపూర్ణంగా పారాయణం చేస్తుంటారు. ఇలా చేయకపోయినా ఏ తప్పు ఉండదని పెద్దలు చెబుతున్నారు. ఏవిధంగా పారాయణం చేసినా భగవద్గీత మనకు మేలు చేస్తుంది. ఏ దోషమూ రాదు. ప్రతీ ఒక్కరిని పారాయణం చేసి అందులోని విలువలు తెలుసుకోమని చెప్పండి . భగవద్గీత చదవడం వల్ల ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సర్వ పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని చెపుతారు. అర్జున విషాదయోగం చదవడం వల్ల మానవుడికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది


భక్తియోగం పారాయణం వల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. క్షేత్రక్షేత్ర విభాగయోగం చదవడంతో చండాలత్వం నశిస్తుంది. గణత్రయ విభాగయోగంతో స్త్రీహత్యా పాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×