Karungali Mala: మన దేశంలో మాలలకీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో ముఖ్యమైనదే కరుంగలి మాల. దీన్ని ధరించడం వల్ల శరీరానికి, మనస్సుకు, ఆధ్యాత్మికతకు మంచిదంటూ చాలామంది విశ్వసిస్తారు. చాలా మంది ప్రముఖులు,సినీ తారలు, రాజకీయ నాయకులు, కరుంగలి మాలను ధరిస్తూ కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్, నాగబాబు, సమంత, సాయిపల్లవి, ధనుష్, విజయ్ సేతుపతి, నయనతార వంటి వారు కూడా ఇదే మాలను ధరించడం అందరిని ఆశక్తిని కలిగిస్తుంది. కానీ నిజంగా కరుంగలి మాల వల్ల మంచి జరుగుతుందా? ఇది శాస్త్రపరంగా సత్యమేనా లేక కేవలం ఒక ఆధ్యాత్మిక నమ్మకమా? ఈ వీడియోలో కరుంగలి మాల యొక్క మూలం, ఉపయోగాలు, శాస్త్రీయ వైఖరి, విభిన్న విశ్వాసాలపై స్పష్టత తీసుకురానున్నాం.
కరుంగలి అంటే ఏమిటి?
కరుంగలి అనేది ఒక మినుముల పరిమాణం ఉన్న గుబురు గుబురుగా ఉండే చెట్టు గింజ. ఇది ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, శ్రీలంక వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీన్ని తమిళంలో ‘కరుంకళి’ అంటారు. ఇది ఎక్కువగా నల్లగా ఉండటం వల్ల దీనికి “బ్లాక్ బీడ్స్” అనే పేరు కూడా ఉంది. దీన్ని దారం మీద పూజించి ధరించేవారు ఎక్కువ.
ధరించే ప్రయోజనాలు – ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం:
ప్రాచీన కాలం నుంచి కరుంగలి మాలను ధరించడం వల్ల దుష్ట శక్తులు దూరం అవుతాయని నమ్మకం ఉంది. చిన్న పిల్లలకు, గర్భిణీ మహిళలకు ఈ మాలను వేసే వారు సాధారణంగా కనిపిస్తారు. దీనివల్ల ఈవిల్ ఐ (దృష్టి), బద్ద దృష్టి (evil vibrations) నుండి రక్షణ పొందుతామని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా, శరీర శక్తి కేంద్రీకరణ, మనస్సు స్థిరత, ఒత్తిడి తగ్గుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయని అంటారు.
శాస్త్రపరంగా కరుంగలి ప్రయోజనాలేమైనా ఉన్నాయా?
ఇక్కడే అసలు ప్రశ్న. ఇప్పటి వరకు కరుంగలి మాల వల్ల శాస్త్రపరంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టంగా ఏ వైద్య పరిశోధన ఆధారాలు లేవు. అయితే, మానసిక విశ్వాసం, ప్లేసీబో ఎఫెక్ట్ (Placebo Effect) వలన కొన్ని మంచి ఫలితాలు అనుభవించినట్లు ప్రజలు చెబుతుంటారు. అంటే, మీరు నమ్మితే అది మీ శరీరానికీ, మనస్సుకీ మంచి చేస్తుంది అన్నమాట. కానీ శాస్త్రవేత్తల దృష్టిలో ఇది నేరుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందనే నిర్దిష్ట ఆధారాలు లేవు.
ధార్మిక పురాణాల ప్రకారం:
కరుంగలి మాల శివుని అభిమానం పొందే ఒక మాలగా భావించబడుతుంది. దీనిని ధరించడం వల్ల శత్రు బలాలు పని చేయవు, దుర్మార్గ శక్తులు సమీపించవు అని పురాణాల ముత్యాల్లా ప్రచారంలో ఉంది. తమిళనాడు ప్రాంతాల్లో అయితే, పాము కాటు నుంచి కాపాడేందుకు కూడా ఈ మాలను ధరించేవారు. అలాగే ఇది ఒక రకమైన ‘నేచురల్ షీల్డ్’గా పనిచేస్తుందని నమ్మకం ఉంది.
పిల్లలకి కరుంగలి మాల ఎందుకు వేస్తారు?
చిన్నపిల్లలు రోధించడమో, అరుస్తూ ఉండటమో, శాంతంగా లేకపోవడమో కనిపిస్తే పెద్దలు వెంటనే దృష్టి తగిలిందని భావించి కరుంగలి మాల వేసేస్తారు. ఇది శరీరంపై మానసికంగా ఒక భద్రతను కలిగిస్తుంది. వాస్తవానికి ఇది పిల్లల తల్లిదండ్రులకు మనశ్శాంతిని ఇస్తుంది.
వాస్తవికత ఎక్కడ ఉంది? ఏం చేయాలి?
కరుంగలి మాల వేసుకుంటే శరీర ఆరోగ్యానికి ప్రత్యక్షంగా మేలు చేస్తుందనే ఆధారాలు లేవు. కానీ విశ్వాసం వల్ల మనసు శాంతియుతంగా ఉంటే, దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. ఇది శాస్త్రపరంగా సిద్ధించబడిన నిజం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విశ్వాసం ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
మీరు కరుంగలి మాలను ధర్మపరంగా, ఆధ్యాత్మికంగా నమ్మి ధరించాలనుకుంటే పెట్టుకోండి. దానివల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. కానీ దీనిని ధరించడమే ఆరోగ్య సమస్యలకు పరిష్కారమంటూ నమ్మకండి. ఇది ఒక రక్షణ కవచంలా మీ మనసుకే పని చేస్తుంది, కానీ ఫిజికల్ ఆరోగ్యానికి గ్యారంటీ కాదు. కరుంగలి మాల అనేది శరీరానికి మించిన మనసుకు సంబంధించినది. ఇది ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు నమ్మితే మంచే జరుగుతుంది. కానీ శాస్త్రపరంగా చూస్తే ఇది మానసిక నమ్మకం మీద ఆధారపడిన ఓ సంప్రదాయం మాత్రమే.