Pawan Kalyan: కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా సంచలనాలు క్రియేట్ చేస్తాయి. గతంలో ఎలా చరిత్రను క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో కూడా మహావతార నరసింహ అనే సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ షోస్ మొదలైన ఈ సినిమా రోజురోజుకు షోస్ పెంచుకోవడమే కాకుండా మంచి ఆదరణ కూడా సాధించుకుంటుంది.
పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు మహావతార నరసింహ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. సెకండాఫ్ విషయంలో చాలామందికి విపరీతమైన కంప్లైంట్ లు ఉన్నాయి. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ విభాగంలో కూడా విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది.
వీరమల్లుకు పోటీ
వీరమల్లు సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఆ మరుసటి రోజు బాక్సాఫీస్ వద్ద మహావతార నరసింహ సినిమా వచ్చి మంచి టాక్ ను సాధించుకోవడం మొదలుపెట్టింది. ఎక్కువమంది పిల్లలకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. గతంలో హనుమాన్ సినిమా వచ్చి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ఇప్పుడు మహావతార నరసింహ సినిమా అటువంటి సంచలనాలని క్రియేట్ చేస్తుంది. కలెక్షన్లు చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.
పవన్ కళ్యాణ్ సినిమా చూడాలి
మహవతార్ నరసింహ సినిమాని గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఇదివరకే మిగతా భాషల్లో ఎన్నో హిట్ అయిన సినిమాలను గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందించింది. గతంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతారా సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించింది ఈ సంస్థ. ప్రస్తుతం ఇదే సంస్థ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాను కూడా డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తున్న తరుణంలో అల్లు అరవింద్ సక్సెస్ మీట్ లో మాట్లాడారు.
అరవింద్ మాట్లాడుతూ… సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కు తెలిసినంత వెరేవరికీ తెలియదు. సనాతన ధర్మం గురించి పవన్ చెబుతుంటే అందరం మంత్రముగ్ధులం అయిపోతాం. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని చూడాలి అంటూ రిక్వెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూసినట్లయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనడంలో సందేహం లేదు. వీరమల్లు కలెక్షన్లకి కొద్దిపాటి దెబ్బ కొట్టిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది.
Also Read: Rajinikanth Speech : ఎన్న తలైవా… స్టేజ్ పైనే రజినీకాంత్ అదిరిపోయే కామెడీ