Gonda Accident: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది. స్పాట్‌లో 11 మంది మృత్యువాత పడ్డారు. ఘటన నుంచి తేరుకునేలోపు కొందరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూండాలోని మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిహాగావ్ ప్రాంతానికి చెందిన ప్రహ్లాద్ గుప్తా తన కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి పృథ్వీనాథ్ దేవాలయాన్ని సందర్శించాలని డిసైడ్ అయ్యారు. ఆదివారం వెళ్లి స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు బొలెరో వాహనాన్ని బుక్ చేసుకున్నారు.
మొత్తం స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం వేకువజామున 15 మంది బయలుదేరారు. ఉదయం 10 గంటల సమయంలో వాహనం వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో పరాసరాయ్ రోడ్డులోని రెహ్రా గ్రామం సమీపంలో సరయు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృతదేహాలను బయటకు తీసినట్టు స్థానిక అధికారులు చెప్పారు. గాయపడిన నలుగురిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది.
ఇటీవల వర్షాలు పడడంతో కాలువ నీటితో నిండిపోయింది. కాలువలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. మృతి చెందినవారిలో బీనా, కాజల్, మెహక్, దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, అనసూయ, సామ్య ఉన్నారు. వీరిలో చిన్నారులు ఉన్నారు. గాయపడినవారిలో డ్రైవర్ సీతాశరన్, రాంలాఖాన్, పింకీ కసౌధన్, అభిషేక్ ఉన్నారు.
ALSO READ: క్లాస్ రూమ్‌లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని సూసైడ్
వాహనం పడిపోయిన వెంటనే భారీ శబ్దాలకు స్థానికులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. కారు తలుపులు మూసుకుపోవడంతో లోపల వ్యక్తులను బయటకు తీయడం కష్టంగా మారింది. కిటికీలు పగలగొట్టి కొందర్ని బయటకు తీసి అక్కడికక్కడే CPR చేశారు. వారి ప్రాణాలను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు.
ఘటన గురించి తెలియగానే సీఎం యోగి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. గోండా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందించాలన్నారు.
गोंडा में भीषण हादसा
गोंडा में श्रद्धालुओं से भरी कार नहर में गिरी
उसमें सवार 15 लोगों में से 11 की मौत
बोलेरो कार सरयू नदी में गिरी#CarAccident | @myogiadityanath | @Uppolice pic.twitter.com/1V9pQgSF8l
— HIMANSHU PARMAR (@himanshu_171120) August 3, 2025