BigTV English

Doors of Kedarnath Temple Opens : తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Doors of Kedarnath Temple Opens : తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Kedarnath Temple Opend Today: ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కేదార్ నాథ్ ఆలయం తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఉదయం 7 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి వాలంటీర్లు చెప్పులు లేకుండా కాలి నడకన భుజాలపై మోస్తూ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అదేవిధంగా చార్ ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు.


కేదార్ నాథ్ దేవాలయం.. పరమేశ్వరుడి పవిత్ర ఆలయంగా భావిస్తుంటారు. భారతదేశంలోని ఉత్తరాఖండ్ స్టేట్ లోని మందాకిని నదికి దగ్గరలో గర్వాల్ హిమాలయ శ్రేణులలో ఉంటుంది. అతి పురాతనమైన శివలింగాలలో ఇది ఒకటి అని చెబుతుంటారు. దీనిని శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేర్కొంటారు. గౌరికుండ్ నుంచి డోలీలు, గుర్రాల ద్వారా లేదా కాలినడక మాత్రమే ఈ గుడికి భక్తులు చేరుకుంటారు.

Also Read: ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..


రిషికేశ్ నుంచి పూర్తిగా కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం దాదాపు 16 గంటలపాటు సాగుతుంది. ఈ ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్లుగా విశ్వసిస్తుంటారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతిఏటా శీతాకాలంలో ఆరు నెలలపాటు మూసివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం మొత్తం పూర్తిగా మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని శీతాకాలంలో మూసివేసి, తిరిగి వేసవిలో తెరుస్తారు.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×