Big Stories

Chicken Shawarma: ప్రాణాలు తీసిన చికెన్ షావర్మ.. ఒకరు మృతి.. ఐదురుగురికి సీరియస్!

1 Person Died and 5 People are Serious after eating Chicken Shawarma: ఇటీవల బయట తినే ఆహారం కల్తీ అవుతుందని తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. ముఖ్యంగా చికెన్ కు సంబంధించిన ఆహార పదార్థాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయి. చికెన్ షావర్మాలు తిని చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. ఇప్పటికే తమిళనాడులో 14 ఏళ్ల బాలిక చికెన్ షావర్మ తిని ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం భయాందోళనకు గురిచేస్తుంది.

- Advertisement -

స్ట్రీట్ ఫుడ్ స్టాల్ లో దొరికే షావర్మా తిని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మాన్ ఖుర్డ్‌కు చెందిన కొందరు యువకులు షావర్మ తినడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఆనంద్ కుంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షెక్ అనే స్నేహితులు కలిసి చికెన్ షావర్మ తినడానికి వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న షావర్మ తిని కాసేపటి తర్వాత అస్వస్థతకు గుర్యయారు. ఈ తరుణంలో వాంతులు, విరేచనాలు అవ్వడం ప్రారంభమయ్యాయి. అనంతరం వారి తల్లిదండ్రులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

- Advertisement -

Also Read: Bitter Gourd: కాకరకాయ చేదుగా ఉందని తినట్లేదా.. ఈ టిప్స్ పాటిస్తే చేదు ఇట్టే మాయం అవుతుంది

ప్రథమేష్ భోక్సేకు పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స అందించలేమని మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. అయితే మందులు తీసుకుని ఇంటికి చేరుకునే సమయంలో పరిస్థితి మరింత విషమించింది. దీంతో వెంటనే వేరే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వైద్యులు చికెన్ తినడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భోక్సే మరణించగా, మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News