BigTV English

Apsaras: అప్సరసలు మొత్తం ఎంత మందో తెలుసా..? అసలు స్వర్గంలో వాళ్లు ఏం చేస్తారో తెలుసా..?

Apsaras: అప్సరసలు మొత్తం ఎంత మందో తెలుసా..? అసలు స్వర్గంలో వాళ్లు ఏం చేస్తారో తెలుసా..?

Apsaras: స్వర్గంలో దేవతలను రుషులను నాట్య కానాలతో అలరించేందుకు నియమించన వారు అప్సరసలు. వీరు చాలా అందమైన అద్బుతమైన నృత్యకారులు. తమ ఒంపు సొంపులతో వయ్యారాలు ఒలకబోస్తూ.. ఎంతటి మగవారినైనా తమ దాసులను చేసుకోగల నెరజాణలు. అందంగా ఉన్నవాళ్ల గురించి పొగడాలంటే ఎవరైనా అప్సరసలాగా ఉన్నావని అంటారు. అందమంటే ఇలా ఉంటుందా..? అనేంతగా అందానికి నిర్వచనంలా అప్సరసలు ఉంటారు. మన పురాణాలలో మనుషులు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటారు. స్వర్గమంటే సంతోషం.  సంతోషం అంటే కామం, భోగం. వీటన్నింటిని స్వర్గలోక వాసులకు అందిచే వారే అప్సరసలు.


అప్సరసలు అందరూ  పాల సముద్ర మథన సమయంలో మేరుక పర్వతం నుంచి జన్మించారని చెప్తారు. అలాగే భాగవత పురాణం కూడా కశ్యపుడు అతని ముని నుంచి అప్సరసలు జన్మించారని పేర్కోంది. అప్సరసలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది కేవలం నాలుగైదు పేర్లు మాత్రమే.. కానీ బ్రహ్మ పురాణం ప్రకారం ముఫ్పై ఒక్క అప్సరసలు ఉన్నారు. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అంటారు. వీరు ఊర్వశి, మేనక, రంభ, తిలొత్తమ్మ, ఘ్రితచి, మంజుకేశి, సుకేశి, మిశ్రకేశి, సులోచన, సౌదామిని, దేవదత్త, దేవసేన, మనోరమ, సుదతి, సుందరి, విగఘ, వివిధ, బుద్ద, సుమాల, సంతతి, సునంద, సుముఖి, మగధి, అర్జుని, సరళ, కేరళ, ధృతి, నంద, సుపుస్కల, సుపస్మల, కలభ.

అప్సరసలు తమ ఆకారాన్ని శరీర సౌష్టవాన్ని ఇష్టానుసారంగా మార్చుకోగలరు. వీరందరూ ఇంద్రుడి ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఇంద్రుడు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి మహర్షుల తపస్సులను భగ్నం చేయడానికి అప్సరసలను ఉపయోగించినట్టు మనకు పురాణాలలో కనిపిస్తుంది. అప్సరసలు మహర్షులు తపస్సులు చేసే లోకాలకు ప్రదేశాలకు వెళ్లి తమ అందచందాలతో నాట్యంతో వారి ఏకాగ్రతకు భంగం కలిగించి మహర్షుల తపస్సుకు విఘ్నం కలిగించేవారు. తద్వారా ఎవ్వరూ ఇంద్ర పదవికి పోటీ రాకుండా యుగాలుగా ఇంద్రుడు తన సింహాసనాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.


కొన్ని సార్లు వీరు మహర్షులతో శపించబడటం కూడా మనం పురాణాలలో చూశాం. చాలా మంది అప్సరసలు మహర్షులతో శృంగారంలో పాల్గొని  వారి వల్ల పిల్లలను కూడా కన్నారు. అప్సరసలకు ఉన్న గొప్ప గుణం వీరు శృంగారంలో పాల్గొని పిల్లలను కన్నా మరలా వీరి కన్యత్వం మామూలు స్థితికి వస్తుంది. వీరి శరీర ఆకృతి కూడా మారదు. అందువల్ల యుగయుగాలు వీరు ఎంతో మంది మహర్షులతో శృంగారం జరిపినప్పటికీ వీరు కన్నెలుగా అమరత్వంతో ఉంటారు. వీరు విశ్వంలో ఉన్న 14 లోకాలకు వెళ్లగలిగే శక్తి కలిగి ఉంటారు. దేవ కన్యలకు ఉన్న శక్తులు అప్సరసలకు ఉంటాయి. ఇప్పుడు కొంత మంది ప్రధానమైన అప్సరసల గురించి తెలుసుకుందాం.

ఊర్వశి: ఈమెను అప్సరసలలో ప్రధానమైన అత్యంత అందమైన అప్సరసగా చెప్తుంటారు. ఒకసారి నర నారాయణుల తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు ఇద్దరు అప్సరసలను పంపినప్పుడు నారాయణుడు తన తొడల నుంచి వారి కన్నా అందమూన ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి కానుకగా పంపిస్తాడు.

మేకన: ఈమె కూడా అప్సరసలలో చాలా అందగా ఉంటుంది. పాల సముద్ర మనధ సమయంలో మేనక పుట్టుకొచ్చింది. విశ్వామిత్రుడి శక్తికి భయపడ్డ ఇంద్రుడు రంభ, తిలొత్తమ్మ అనే ఇద్దరు అప్సరసలను పంపిస్తాడు.  అయితే వారిని విశ్వామిత్రుడు పట్టించుకోకపోగా శాపం పెడతాడు. దీంతో ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనకను చూసిన విశ్వామిత్రుడు మోహించి ఆమెతో  శకుంతల అనే కుమార్తెను కంటాడు. శకుంతల, దుష్యంతుల కథ అందరికీ తెలిసిందే.

రంభ: ఈమె అప్సరసల రాణి. కుభేరుడి కుమారుడైన నలకూబరుని భార్య. కుబేరుణి సవతి సోదరుడైన రావణుడు రంభను మానభంగం చేస్తాడు. దీంతో ఆగ్రహించిన నలకూబరుడు రావణుడిని శపిస్తాడు. ఎవరైనా స్త్రీలను బలవంతం చేస్తే చనిపోతావని శాపం పెడతాడు.

తిలొత్తమ్మ: విశ్వ వాస్తు శిల్పి విశ్వకర్మ తిలొత్తమను సృష్టించినట్టు పురాణాలలో ఉంది. రాక్షసులైన సుంద, ఉపసుంద ఇద్దరూ ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడానికి తిలొత్తమ్మనే కారణం. శివుడు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా తిలొత్తమ్మ పట్ల ఆకర్షితులు అయ్యారని పురాణంలో చెప్పబడింది.

ఘ్రితచి: ఈమె ఇంద్రుడి ఆస్థానంలో అత్యద్బుతమైన అప్సరస. ద్రోణాచార్యుడు, సుఖరుచికి ఆధ్యాత్మిక తల్లి. రెండు సందర్బాలలో వారి పుట్టకకు కారణం ఘృతాచినే.

అప్సరసలు అందరూ దేవతలకు, రుషులకు కామ భోగాలు అందించడంతో పాటు వారి శాపాలకు గురయ్యారు. వీరివి అందం చాటున దాగిన విషాద గాథలు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు 

 

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×