BigTV English

LIC Nivesh Scheme: నేడు రూ.15 లక్షల పెట్టుబడి..రేపు వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే

LIC Nivesh Scheme: నేడు రూ.15 లక్షల పెట్టుబడి..రేపు వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే

LIC Nivesh Scheme: మీకు పెళ్లైన వెంటనే, లేదా మీ పిల్లలు పుట్టిన తర్వాత, లేక రిటైర్మెంట్ కోసం ఒకేసారి పెట్టుబడి చేయాలని చూస్తున్నారా. లేదా మీ ఉద్యోగ జీవితం ముగిసేలోగా మీ డ్రీమ్ హౌస్ సహా దేనికోసమైన ప్లాన్ చేయాలని భావిస్తున్నారా. ఆ కలల్ని నిజం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే మీరు ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ FDలపై వడ్డీ రేట్లు అంతంతమాత్రంగానే ఉంటే, స్టాక్ మార్కెట్ ఆశ్చర్యపరిచే returns ఇస్తుంది. కానీ, అంతకంతకూ పెరిగిపోతున్న రిస్క్‌కు ఎదురెళ్లాల్సి ఉంటుంది.


భద్రతోపాటు ఆదాయం
అలాంటప్పుడు చాలా మందికి గవర్నమెంట్ సంస్థ అయిన LICపైనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దీనిలో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసి, లాంగ్ టర్మ్‌ పాలసీ తీసుకుంటే, మీ లైఫ్ కు భద్రతోపాటు ఆదాయం కూడా లభిస్తుంది. అందుకోసం LIC Nivesh Plus ప్లాన్‌లో పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు రూ.15 లక్షలు సింగిల్ ప్రీమియంగా పెట్టి 25 ఏళ్ల టర్మ్ తీసుకుంటే, సగటు 8% రాబడులు వస్తాయని భావిస్తే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

LIC Nivesh Plus అంటే ఏంటి?
LIC Nivesh Plus అనేది ఒక యూనిట్ లింక్డ్ ప్లాన్ (ULIP). అంటే దీంట్లో మీరు పెట్టే డబ్బు ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే సరిపోతుంది. జీవిత భీమా కవరేజ్‌ కూడా దీనిలో అందిస్తారు. మీరు ఏ Fund ఎంచుకుంటారో దానిని బట్టి మీ డబ్బు స్టాక్ మార్కెట్, గవర్నమెంట్ బాండ్స్, డెబెంచర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ అవుతుంది.


Read Also: Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్.. …

ప్రధాన లక్షణాలు:
సింగిల్ ప్రీమియం ప్లాన్: ఒక్కసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే చాలు.
పాలసీ టర్మ్: ఇక్కడ 25 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు.
Fund Options: Flexi Growth Fund, Bond Fund, Secure Fund, Balanced Fund, Pure Fund లాంటి ఐదు రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
పాక్షిక మొత్తం: 6 ఏళ్ల తర్వాత డబ్బును తీసుకోవచ్చు.

ప్రీమియం:

-రూ.15 లక్షలు (సింగిల్ పేమెంట్)
-పాలసీ టర్మ్: 25 సంవత్సరాలు
-సగటు రాబడి (CAGR): 8%
-Fund Type: Flexi Growth Fund (మంచి రాబడులకి ఉద్దేశించినదే)
-అంటే 25 ఏళ్ల తర్వాత మీకు రూ.1 కోటి పైగా మీ చేతికి వస్తుంది
-ఖర్చులు తీసేసినా, సగటున రూ.85 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉంది.

ఈ స్కీంలో ఇవి కూడా..
ఈ స్కీంలో మీరు రూ. 15 లక్షలు పెట్టి 25 ఏళ్లలో రూ.1 కోటికి పైగా సంపాదించుకోవచ్చు. ఇదంతా వాస్తవిక 8% CAGR ఆధారంగా లెక్కించబడింది. ULIP ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తే returns ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది Tax-free under section 10(10D), అంటే maturityకి వచ్చే మొత్తం పన్ను మినహాయింపు పొందుతుంది (subject to latest tax laws). దీనిలో మీరు Risk coverage + Wealth creation రెండింటిని పొందుతారు.

ఎలాంటి ఛార్జీలు ఉంటాయి
-Premium Allocation Charges
-Fund Management Charges (1.35%)
-Mortality Charges
-Policy Administration Charges

దీని వల్ల returns కొంత తగ్గవచ్చు. కానీ మీరు Long-Termకి వెళ్తే వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందనీ, returns మీద పెద్దగా ప్రభావం ఉండదనీ నిపుణులు చెబుతున్నారు.

నోట్: బిగ్ టీవీ పెట్టుబడి సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇన్వెస్ట్ చేయాలని మీకు అనిపిస్తే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది

Related News

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

Big Stories

×