Tirumala Benefits: తిరుమలలో వాలంటీర్‌గా సేవ చేయాలని ఉందా..? సేవ చేయడానికి ఎలాంటి అర్హతల ఉండాలో తెలుసా.? సేవ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసా..? అక్కడ లభించే బెనిఫిట్స్ తెలిస్తే వెంటనే మీరు సేవకు రెడీ అయిపోతారు. ఇంతకీ తిరుమల, తిరుపతి దేవస్థానంలో వాలంటీర్‌గా సేవ ఎన్ని రోజులు చేయాలి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ ప్రత్యక్ష్యదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్క సారి దర్శించుకుంటేనే కోట్ల జన్మల పుణ్యఫలం లభిస్తుందంటారు పండితులు. అటువంటిది ఏకంగా ఆ స్వామి సన్నిధిలో సేవ చేసే భాగ్యం దొరకడం అనేది ఇంకెన్ని కోట్ల జన్మల పుణ్యఫలమే ఆలోచించండి. ఆ ఒక్క అవకాశం కోసం లక్షల మంది నెలల తరబడి ఎదురుచూస్తుంటారు. స్వామి వారి సేవకు ఒక్కచాన్స్ ఎప్పుడు దొరుకుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే తిరుమల స్వామి వారి సేవకు అవకాశం లభించిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా కోట్ల రూపాయలు పెట్టినా దొరకని స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం వాలంటీర్లకు దొరుకుంతుంది. సేవకులకు శ్రీవారి దర్శనం, ఉచిత వసతి, ఉచిత భోజనం, మరియు ఇతర సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది. అదే కాకుండా సేవకులకు పుణ్యంతో పాటు అనేక ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలను కూడా పొందుతారు.
శ్రీవారి దర్శనం: తిరుమలలో సేవకు ఎంపికైన వారికి కొన్ని సార్లు గర్భగుడిలో విధులు అప్పగిస్తే వారి జన్మ ధన్యం అయినట్టే.. ఇక గర్భగుడిలో సేవ రాని వారికి సాధారణ దర్శనంతో పాటు విఐపి దర్శనం కూడా కల్పిస్తుంది టీటీడీ బోర్డు. ఇది వారికి స్వామివారిని మరింత దగ్గరగా దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది.
వసతి: తిరుమల, తిరుపతిలోని ఆలయాల్లో సేవ చేసే వాలంటీర్లకు టీటీడీ వారి ద్వారా ఉచిత వసతి సౌకర్యం కల్పించబడుతుంది. ఇది వారికి విశ్రాంతి తీసుకోవడానికి, తదుపరి సేవలకు సిద్ధం కావడానికి ఉపయోగపడుతుంది.
భోజనం: సేవకులకు తిరుమల, తిరుపతిలోని అన్న అన్నదాన కేంద్రాలలో ఉచిత భోజన సదుపాయం టీటీడీ బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఇది వారికి ఆరోగ్యకరమైన ఆహారం లభించేలా చేస్తుంది.
ఇతర సౌకర్యాలు: తిరుమలలో వాలంటీర్లుగా సేవ చేసే టైంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనా టీటీడీ బోర్డు ద్వారా ఉచిత వైద్యం అందించడుతుంది. అలాగే సేవకులకు రవాణా సౌకర్యాలు దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు సేవ చేసే భక్తులకు కొండ కింత గోవింద రాజస్వామి ఆలయంలో కానీ కొండ మీద ఆలయమే కాకుండా జపాలి తీర్థం లాంటి దూరం ఉన్న ప్రదేశాలకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఆలయ వాహనాల్లోనే సేవకులను తీసుకెళ్తారు.
ఎవరు అర్హులు: తిరుమల లో సేవలు నాలుగు రకాలు ఉంటాయి. అందుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి మీరు సేవ చేయాలనుకున్నప్పుడు టీటీడీ వెబ్సైట్ లో కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
పుణ్య ఫలం: అన్నింటికన్నా ముఖ్యమైనది సేవకులుగా మారిన భక్తులకు లభించే పుణ్యం కొట్టు పెట్టినా తెచ్చుకోలేనిది అని పండితులు చెప్తుంటారు. స్వామి వారి సేవ చేయడానికి అవకాశం రావడమే పెద్ద అదృష్టంగా బావించాలి అని చెప్తుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: కాలికి నల్లదారం కడుతున్నారా..? అయితే ఆ నాలుగు రాశుల వాళ్ళు జాగ్రత్త