Black Thread: కాలికి నల్లదారం కడుతున్నారా..? ఆయితే ఆగండి కొన్ని రాశుల వారు మాత్రమే కాలికి నల్లదారం కట్టుకోవాలట. మరికొన్ని రాశుల వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లదారం కట్టుకోకూడదని పండితులు చెప్తున్నారు. ఒకవేళ తెలియక మీరు నల్లదారం కట్టుకుంటే లేనిపోని సమస్యలు వెంటాడతాయని.. మీ జీవితమే తలకిందలు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇంతకీ నల్లదారం ఎవరు కట్టుకోవాలి..? ఎవరు కట్టుకోకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం.
నరదిష్టి, చెడు దృష్టి నుంచి రక్షణ కోసం కాలికి నల్లదారం కట్టుకోవడం భారతీయుల్లో సర్వసాదారణం. ఈ నల్ల దారం కట్టుకోవడం వల్ల ఎన్నో రకాల చెడు దృష్టుల నుంచి తప్పించుకోవచ్చని నమ్ముతారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా అందరూ నల్లదారాన్ని కట్టుకుంటుంటారు. అలాగే తమలోని నెగటివ్ ఎనర్జీ తొలిగిపోతుందని ప్రతికూలశక్తులు నిర్మూలించబడతాయని కూడా చాలా మంది విశ్వసిస్తారు. అయితే కొందరికి నల్లదారం వల్ల ఉపయోగం లేకపోగా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అసలు ఆ ప్రాబ్లమ్స్ వారికి ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందట. నల్లదారం కట్టుకోవడం వల్ల అంతటి ప్రతికూలత ఎదుర్కోబోయే రాశులేవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి: ఈ రాశిలో పుట్టిన వారు ఎట్టి పరిస్థితుల్లో కాలికి నల్లదారం కట్టుకోకూడదట. తెలియక కట్టుకున్న కానీ వెంటనే తీసేయాలని పండితులు సూచిస్తున్నారు. వీరు నల్లదారం కట్టుకోవడం వల్ల వారి జీవితంలో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని తద్వార ఆర్థిక సంబంధమైన సమస్యలు వేధిస్తాయని చెప్తున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాలికి నల్లదారం కట్టకూడదట. ఈ రాశి వ్యక్తులు అంగారకుడి ఆధీనంలో ఉంటారట. కాబట్టి ఈ రాశి వారు నల్లదారం కట్టుకోకూడదు. ఒకవేళ కట్టుకుంటే ఈ రాశి వారికి అశుభాలు జరగడం.. మనఃశాంతి లేకపోవడం.. అధిక ఆందోళన చెందడం లాంటి సమస్యలు వేధిస్తాయి.
సింహ రాశి: ఈ రాశి జాతకులకు కూడా నల్లదారం అచ్చి రాదట. సింహరాశిలో పుట్టిన వాళ్లకు కాలికి నల్లదారం కట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ పెరిగి జీవితంలో మనఃశాంతి ఉండదట. అలాగే ఆర్థిక పరమైన సమస్యలు వేధిస్తాయట. ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయట.
కర్కాటక రాశి: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా కాలికి నల్లదారం కట్టుకోకపోవడమే మంచిది అని చెప్తున్నారు పండితులు. ఈ రాశి జాతకులు నల్లదారం కట్టుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అలాగే అనారోగ్య సమస్యలు వేధిస్తాయట. ఇక అంత వరకు తాపీగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా కుదేలయినట్టు మారిపోతుందట. ఆర్థిక సమస్యలు కుంగదీస్తాయని పండితులు చెప్తున్నారు.
అయితే ధనస్సు, తుల, కుంభ రాశి వారికి మాత్రమే నల్లదారం కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇక మిగతా రాశులైన వృషభం, మిథునం, కన్య, మకర, మీన రాశుల వారికి సమాన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే నల్లదారం ధరించినప్పుడు ఇష్టానుసారం ధరించకూడదని చెప్తున్నారు. అందుకోసం కొన్ని శాస్త్రీయ పద్దతులు ఉన్నాయని చెప్తున్నారు. శనివారం రోజు ఇంట్లో దేవుడి దగ్గర నల్లదారం ఉంచి.. పూజ చేసుకుని రుద్రగాయత్రి మంత్రం, లేదా శనీశ్వరుడికి సంబంధించిన ఏదైనా మంత్రం తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ, యాభై నాలుగు సార్లు, కానీ నూట ఎనిమిది సార్లు లేదా మీకు వీలైనన్ని మాలలు పఠించిన తర్వాతే నల్లదారం ధరించాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ:రాఖీ పౌర్ణమి తర్వాత ఆ మూడు రాశుల వారి తలరాత మారిపోతుందట – అందులో మీ రాశి ఉండొచ్చు