Deoghar Road Accident: జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. 20 మంది వరకు గాయపడ్డారు. అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలో మంగళవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమునియా అడవి సమీపంలో తెల్లవారుజామున కన్వారియాలతో వెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ఘటనలో 18 మంది మరణించినట్టు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వెల్లడించారు. అనేక మంది గాయపడ్డారని తెలిపారు. పోలీసు అధికారుల వెర్షన్‌లో మరోలా ఉంది. కేవలం ఐదుగురు మాత్రమే మరణించారని, చాలామంది గాయపడ్డారని చెబుతున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.
ఘటన జరిగిన ప్రాంతం బీజేపీ ఎంపీ దుబే నియోజకవర్గం. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
ALSO READ: డబ్బుల వర్షం పేరుతో మోసం.. హైదరాబాద్‌లో ఘటన
ఈ ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది మరణించారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది వరకు కన్వారియాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐదుగురు మృతుల పేర్లను మాత్రమే వెల్లడించారు. యాత్ర నుంచి అటు కన్వారియాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
देवघर में कांवरियों से भरे बस और गैस लदे ट्रक के बीच भीषण टक्कर 18 कावड़ियों की मौत
करीब एक दर्जन कांवरियें घायल #devghar #JharkhandNews @nishikant_dubey pic.twitter.com/asF7eBtjCb
— Flood Monitor (@ag_observer) July 29, 2025