BigTV English

Vishwambhara: టీజర్ కాపీ ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్.. నిజమే అంటూ క్లారిటీ!

Vishwambhara: టీజర్ కాపీ ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్.. నిజమే అంటూ క్లారిటీ!

Vishwambhara:చిరంజీవి(Chiranjeevi) హీరోగా వశిష్ట మల్లిడి (Vassishta Mallidi) డైరెక్షన్లో రాబోతున్న సినిమా విశ్వంభర (Vishwambhara). ఈ మూవీ ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. కొడుకు రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా కోసం చిరంజీవి తన సినిమాని వాయిదా వేసుకున్నారు. అయితే గేమ్ ఛేంజర్ విడుదలై ఇన్ని రోజులైనా కూడా విశ్వంభర ఎందుకు రావడం లేదనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ వల్లే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందంటూ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ వశిష్ఠ. అంతేకాదు విశ్వంభర సినిమా టీజర్ పై వచ్చిన కాపీ ట్రోల్స్ గురించి కూడా స్పందించారు. అవును ఈ సినిమా కాపీనే అంటూ ఆయన మాట్లాడిన మాటలు షాక్ కి గురి చేస్తున్నాయి. మరి ఇంతకీ డైరెక్టర్ అలా ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం..


విశ్వంభర టీజర్ పై కాపీ ట్రోల్స్.. డైరెక్టర్ క్లారిటీ..

విశ్వంభర (Vishwambhara) డైరెక్టర్ వశిష్ట తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో విశ్వంభర టీజర్ పై వస్తున్న కాపీ ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. విశ్వంభర టీజర్ లో వచ్చిన పాప అచ్చం అవతార్ (Avatar) సినిమాలో ఉన్న గెటప్ తో ఉంది. అంటే ఇది అవతార్ కాపీ అంటూ ట్రోల్స్ చేశారు. అయితే ఇది కాపీనే కానీ అవతార్ సినిమాకి కాదు. చందమామ కథల నుండి ఇది తీసుకున్నాను. చందమామ కథలలోని జ్వాలాద్వీపం సిరీస్ లో ఉన్న పాత్రలనే అవతార్ సినిమాలో చూపించారు. అవతార్ సినిమాకి కాపీ అనేకంటే చందమామ కథలకు కాపీ అంటే నేను చాలా సంతోషించేవాడిని. టీజర్ నాకు నచ్చింది కాబట్టి నేను రిలీజ్ చేశాను.


టీజర్ కాపీనే అంటూ డైరెక్టర్ క్లారిటీ..

అలాగే ఈ సినిమా టీజర్ లో కనిపించిన కొండలు చూసి పూర్తిగా అవతార్ సినిమానే అని అంటున్నారు. అయితే సినిమాలో కొండలు అనేవి కేవలం అవతార్ మూవీలో మాత్రమే కాదు ప్రతి సినిమాలో ఉంటాయి. ఇక టీజర్ లో కనిపించిన పాప చెవులు అచ్చం అవతార్ సినిమా లాగా ఉన్నాయంటున్నారు. కానీ ఇలాంటి పాత్రని నేను గతంలో కొన్ని సినిమాల్లో కూడా చూశాను.. అలా అని అవతార్ సినిమాకి విశ్వంభర కాపీ కాదు.. చందమామ కథలను స్పూర్తిగా తీసుకునే నేను ఈ సినిమాలో పాత్రలు డిజైన్ చేశాను.

హీరోయిన్స్ పాత్రలపై డైరెక్టర్ ఏమన్నారంటే?

అలాగే విశ్వంభర మూవీలో హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. విశ్వంభర లో ఎక్కువ మంది హీరోయిన్లు ఉన్నది నిజమే. కానీ ఇందులో మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిష(Trisha). ఆమె తర్వాత ఆషికా రంగనాథ్(Ashika Ranganath). ఇక ఇంకొంతమంది హీరోయిన్స్ స్క్రీన్ పై కొన్ని పాత్రల్లో కనిపిస్తారు. కానీ అస్సలు బోర్ కొట్టదు. ప్రతి హీరోయిన్ ఫ్రెష్ గా కనిపిస్తారు.అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవ్వగానే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు డైరెక్టర్ వశిష్ట.

ALSO READ:Bollywood: నిత్యం తెరపై కనిపించే ఈ హీరోయిన్స్ లో ఇంత టాలెంట్ ఉందా..విషయం తెలిస్తే షాక్!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×