BigTV English
Advertisement

Wedding: పెళ్లి కోసం 28 కి.మీ. నడిచి వచ్చిన పెళ్లికొడుకు.. ఎందుకంటే? ఎక్కడంటే?

Wedding: పెళ్లి కోసం 28 కి.మీ. నడిచి వచ్చిన పెళ్లికొడుకు.. ఎందుకంటే? ఎక్కడంటే?

Wedding: పెళ్లి అంటే జీవితకాల వేడుక. ఎన్నటికీ మరుపురాని మధురమైన ఘట్టం. అలాంటి పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఘనంగా పెళ్లి వేడుక జరుపుతుంటారు. వాళ్లూ అలానే అనుకున్నారు. పెళ్లి సంబరంగా చేసుకోవాలని భావించారు. తీరా పెళ్లి తేదీ వచ్చే సరికి అనుకోని ఆటంకం వచ్చిపడింది. పెళ్లి కోసం పెళ్లికొడుకు రాత్రంతా నడవాల్సి వచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 28 కిలోమీటర్లు నడిచాడు ఆ వరుడు. అతనితో పాటు బంధువులూ నడిచిరాక తప్పలేదు. ముహూర్తం టైమ్‌కి మండపానికి చేరుకోవడంతో పెళ్లి తంతు పూర్తైంది. ఆ తర్వాత హమ్మయ్యా.. అంటూ కాళ్లు ఒత్తుకుంటూ సేద తీరారు పెళ్లికొడుకు బ్యాచ్. ఇంతకీ అసలేం జరిగిందంటే…


ఒడిశాలో జరిగిందీ ఘటన. అక్కడ డ్రైవర్స్ స్టైక్ చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క వాహనం కూడా రోడ్డు ఎక్కనీయడం లేదు. ఇదే ఆ పెళ్లి వారికి సమస్యగా మారింది. వారికి సొంత వెహికల్ లేదు. అద్దెకు వాహనం దొరకలేదు. డ్రైవర్లు తాము స్ట్రైక్‌లో ఉన్నాం.. మేము రామని చెప్పేశారు. మరి ఎలా? పెళ్లికి వెళ్లేది ఎలా?

ఎంత ఆలోచించినా ఆ వరుడి కుటుంబానికి ఎలాంటి మార్గం కనిపించలేదు. వారి దగ్గర టూవీలర్స్ ఉంటే.. వాటిపై పెళ్లి సామాన్లు పంపించారు. మరి పెళ్లికి పరివారమంతా ఎలా వెళ్లేది?


ఇక చేసేది లేక.. పెళ్లికొడుకుతో సహా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అంతా కాళ్లకి పని చెప్పారు. ఎలాగోలా చిన్నగా నడుచుకుంటూ వెళ్దామని బయలు దేరారు. శుక్రవారం ఉదయం పెళ్లి. గురువారం రాత్రి గ్రామం నుంచి నడక స్టార్ట్ చేశారు. అలా అలా రాత్రంతా నడుస్తూనే ఉన్నారు. తెల్లారాక పెళ్లి వాళ్ల ఇంటికి చేరుకున్నారు. మొత్తం 28 కిలోమీటర్ల దూరం నడిచొచ్చారు. కాస్త రిలాక్స్ కాగానే.. పెళ్లి తంతు జరిపించేశారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. పాపం.. పెళ్లి కష్టాలంటూ అనేక మంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల స్ట్రైక్‌పైనా విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్ల డిమాండ్లు నెరవేర్చని ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×