BigTV English

July 2024 Rashifal : జూలైలో ఈ రాశుల వారిపై కుబేరుని అనుగ్రహం..

July 2024 Rashifal : జూలైలో ఈ రాశుల వారిపై కుబేరుని అనుగ్రహం..

July 2024 Rashifal : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో కొన్ని రాశుల వారు వృత్తి మరియు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. జూలైలో శనిగ్రహం తిరోగమనం ఉండబోతుంది. ఇది కాకుండా శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటకంలో సంచరిస్తాడు. ఈ తరుణంలో కుజుడు, బృహస్పతి మరియు శని గ్రహాల స్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఏ రాశి వారికి గ్రహాల స్థానం వల్ల ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


1. వృషభ రాశి

ఈ రాశి వారికి ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఉద్యోగంతో పాటు కోరుకున్న ఆఫర్‌ను కూడా పొందుతారు. జీతంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మొత్తం మీద అన్ని వైపుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. కానీ జాగ్రత్తగా ఖర్చు చేయండి. లేకపోతే పొదుపు చేయలేరు. ప్రేమ జీవితం బాగుంటుంది. భాగస్వామితో బంధం బలపడుతుంది.


2. కర్కాటక రాశి

ఈ మాసం కర్కాటక రాశి వారికి సంబంధించిన ఎన్నో కలలను సాకారం చేస్తుంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిని వేగంగా పూర్తి చేస్తారు. సీనియర్ల నుండి మద్దతు పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సంతోషంగా మరియు సంతృప్తిగా అనుభూతి చెందుతారు.

3. కన్యా రాశి

ఈ రాశి వారి కెరీర్‌కు ఈ సమయం ఒక వరం అని లాంటిది అని శాస్త్రం చెబుతుంది. అదృష్టం అడుగడుగునా సహకరిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. వివాదాస్పద విషయంలో విజయం సాధించవచ్చు. పెట్టుబడికి అనుకూలమైన సమయం. కొత్త ఇల్లు, కారు కొనుక్కోవచ్చు.

4. తులా రాశి

ఈ సమయం తుల రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలనే కల నెరవేరుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన ఎదుగుదల ఉండవచ్చు. ఆస్తి లాభం ఉంటుంది. పాత పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. కొత్త పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయం.

5. మకర రాశి

ప్రతి రంగంలో లాభపడతారు. ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది. కోరికలు ఏవైనా నెరవేరవచ్చు. ఆనందకరమైన సమయం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×