BigTV English

Cash For Marks Scam: ‘క్యాష్ ఫర్ మార్క్స్’ స్కామ్.. 8 మంది అరెస్ట్

Cash For Marks Scam: ‘క్యాష్ ఫర్ మార్క్స్’ స్కామ్.. 8 మంది అరెస్ట్

Cash For Marks Scam: పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం అస్సాంలో వెలుగులోకి వచ్చింది. బీజేపీ పాలిత ప్రాంతమైన అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో క్యాష్ ఫర్ మార్క్స్ స్కామ్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌహతి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గణేష్ లాల్ చౌదరీ కాలేజీకి చెందిన ఓ విద్యార్థికి మార్క్ షీట్‌లో కాలేజీ యాజమాన్యం తేడాను గుర్తించింది.


పరీక్షలకు సంబంధించిన వాస్తవ మార్కులు, మార్క్ షీట్‌లోని మార్కులకు తేడా గమనించిన యాజమాన్యం మార్క్ షీట్‌ను యూనివర్సిటీకి పంపించి తనిఖీ చేయించారు. సదరు విద్యార్థి డబ్బులు చెల్లించి మార్కులు పెంచుకున్నట్లు బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సీఐడీ విభాగం దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసింది.

విద్యార్థి అజీజుల్ హక్‌ను పోలీసులు ప్రశ్నించగా మొదటి, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టార్‌లలో మార్కులు మార్చటానికి రూ. 10 వేలు చెల్లించినట్లు అంగీకరించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. గౌహతి యూనివర్సిటీలో కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేసే సిబ్బంది విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని మార్క్స్ షీట్‌లను డిజిటల్‌గా ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా ఎవరెవరు ఇలా నకిలీ సర్టిఫికెట్స్ తీసుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Also Read: అమలులోకి రానున్న చట్టాలు.. నేరాలకు పాల్పడితే ఇక మీ పని అంతే !

ఇదిలా ఉంటే.. మరో వైపు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే ఐటీఐ లిమిటెడ్ అనే డేటా ఎంట్రీ సంస్థకు గౌహతి యూనివర్సిటీ అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. థర్డ్ పార్టీ ఆపరేటర్ ద్వారా డిజిటల్ మార్క్ షీట్ల ట్యాంపరింగ్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. నిందితులైన కే కృష్ణమూర్తి, ఇస్మాయిల్ హుస్సేన్, అలంగీర్ ఖాన్, అబుల్ బాసర్, మొయినుల్ హక్, అమీనుల్ ఇస్లాం, శివతోజ్, హమేజుద్దీన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మరికొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×